Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి, మంత్రి పదవి వద్దన్న వివేకా

Recommended Video

    టీడీపీ నేత ఆనం వివేకా కన్నుమూత

    నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి (67) బుధవారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    1950 డిసెంబర్ 25వ తేదిన ఆనం వివేకానంద రెడ్డి జన్మించారు. ఆనం వివేకానందరెడ్డికి ఇద్దరు కొడుకులు. మూడు దఫాలు ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు.1999 నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

    ఎమ్మెల్యేగా

    ఎమ్మెల్యేగా

    1999, 2004, 2009లలో నెల్లూరు జిల్లా నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివేకానందరెడ్డి సోదరుడు.

    నెల్లూరు వీఆర్ కాలేజీలో బీకాం చేశారు ఆనం వివేకానందరెడ్డి. ప్రజలతో సన్నిహిత సంబంధాలను వివేకానంద రెడ్డి కలిగి ఉండేవాడు. విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడుగా ఆనం రామనారాయణరెడ్డికి పేరుంది. ప్రత్యర్ధులను తన మాటలతో పాటు, హావభావాలతో చిత్తు చేసేవాడు.

    ఆనం వివేకానంద రెడ్డి

    ఆనం వివేకానంద రెడ్డి

    ఇటీవల కాలంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనం వివేకానందరెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి. నారాయణ ఇతర టిడిపి నేతలు పరామర్శించారు.

    ఒకసారి మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా, చైర్మన్‌గా అలాగే చైర్మన్ల సంఘం ఏపీ అధ్యక్షుగా ఆయన పనిచేశారు. ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నెతెచ్చిన ఆనం ఇక లేరనే విషయాన్ని నెల్లూరు జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీనిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీరుస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయిన వ్యక్తి ఆనం వివేకా.

    చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి

    చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి

    ఆనం పెద్ద కుమారుడు సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు సిటీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. చిన్న కుమారుడు ప్రస్తుతం కార్పోరేటర్ గా ఉన్నారు.

    ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల, డిప్యూటీ సీఎం కేఈ, మంత్రులు నారా లోకేష్‌, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, నారాయణ, నందమూరి హరికృష్ణ సంతాపం తెలిపారు.

    నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తర్వాత

    నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తర్వాత

    నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తర్వాత జిల్లా రాజకీయాలపై అంతగా పట్టు సాధించిన వ్యక్తుల్లో ఆనం వివేకానందరెడ్డి ఒకరు.ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో మంత్రి పదవి ఇస్తానని చెప్పినా తన సోదరుడు రామనారాయణరెడ్డికే మంత్రి పదవి ఇవ్వాలని సూచించాడు.

    వేషభాషలు, ఫ్యాషన్లతో ఆనం వివేకానంద రెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ప్రతి రోజూ సెకండ్ షో సినిమా చూసేవారు. ప్రతి రోజూ భోజనంలో బిర్యానీ ఉండాల్సిందేనని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+