వైసీపీ బిగ్ ప్లాన్, టీడీపీ అలర్ట్ - పులివెందులలో మారుతున్న లెక్కలు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పులివెందుల కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. వైఎస్ జగన్ పోటీ చేసే స్థానం కావటం..షర్మిల కాంగ్రెస్ పగ్గాలు..ఈ సీటును ఈ సారి టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. వైఎస్ కుటుంబానికి చిరకాల ప్రత్యర్ధి సతీష్ రెడ్డిని వైసీపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, వెంటనే టీడీపీ అలర్ట్ అయింది. తాజాగా సతీష్ రెడ్డితో మంత్రాంగం ప్రారంభించింది.

పులివెందుల రాజకీయాల్లో కలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వైఎస్ కుటుంబమే గెలుస్తోంది. సీఎం జగన్ మూడో సారి అక్కడ విజయం కోసం ఎన్నికల బరిలోకి దిగటం ఖాయమైంది. రాజశేఖర్ రెడ్డి నుంచి 2019 ఎన్నికల వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా వారికి నిలిచిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. తాజాగా , వేంపల్లిలో సతీష్ రెడడ్తో వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు, రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమావేశమయ్యారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఇందులకు సతీష్ రెడ్డి అంగీకరించారు. మరో రెండు రోజుల్లో వైసీపీలో చేరటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

TDP leader Btech Ravi meets Sateesh Reddy Amid YSRCP invites him in to the party

ఈ సమయంలోనే టీడీపీ అలర్ట్ అయింది. తాజాగా టీడీపీ పులివెందుల అభ్యర్దిగా రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సతీష్ రెడ్డితో వైసీపీ నేతలు సమావేశం విషయం తెలుసుకొని ఆయన తాజాగా తన కార్యాచరణ ముమ్మరం చేసారు. సతీష్ రెడ్డితో చర్చలు చేసారు. టీడీపీలోకి రావాలని..చంద్రబాబు సూచనగా చెప్పారు.అయితే రెండు రోజులు టైం కావాలని కేడర్‌తో సంప్రదింపులు జరిపి, పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని సతీష్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఇటు, సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఆహ్వానం రావటంతో ఇప్పుడు సతీష్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+