మోడీని మహిళా ఎంపీలు కొరకబోయారు..! జేసీ అల్లుడు మరో షాక్ .!
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న టీడీపీ (tdp)నేత, జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు కూడా అయిన దీపక్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగానికి సిద్దమైన సమయంలో లోక్ సభలో ఆయన్ను మహిళా ఎంపీలు అడ్డుకున్న ఘటనపై ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ దీపక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీని లోక్ సభలో విపక్ష మహిళా ఎంపీలు చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో వారి వద్ద ఆయుధాలు లేవని, కానీ వారు తమ పళ్లనే ఆయుధాలుగా చేసుకుని ఆయన్ను కొరికేందుకు ప్రయత్నించారంటూ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సదరు ఇంగ్లీష్ టీవీ ఛానల్ డిబేట్లో యాంకర్ కూడా షాకయ్యారు. ఒక్కసారిగా గందరగోళానికి గురై తిరిగి దీపక్ రెడ్డిని అదే ప్రశ్న అడిగారు. అయినా ఆయన మరోసారి అవే వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. దీంతో ఆమెకు ఏం చెప్పాలో తెలియలేదు.

మోడీని ప్రతిపక్ష మహిళా ఎంపీలు కోరికే అవకాశం ఉంది - టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2026
pic.twitter.com/dtWBEe2u0I
గతంలో ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలోనూ రిపబ్లిక్ టీవీ ఛానల్ కు వెళ్లి అర్నాబ్ గోస్వామితో చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డి.. తమ పార్టీకే చెందిన పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు గురించి స్పందిస్తూ.. మంత్రి లోకేష్ ప్రస్తావన కూడా తెచ్చారు. లోకేష్ వార్ రూమ్ లో రామ్మోహన్ నాయుడితో కలిసి పరిస్ధితిని సమీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో అర్నాబ్ కూడా షాకయ్యారు. లోకేష్ కూ ఇండిగో సంక్షోభానికీ ఏం సంబంధం అని ప్రశ్నించారు. అయినా దీపక్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో ఇది కాస్తా టీడీపీకీ, రిపబ్లిక్ టీవీకి మధ్య వివాదంలా మారింది. ఇప్పుడు మరోసారి దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ పెంచేలా ఉన్నారన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications