చిట్ ఫండ్ సంస్ధలపై ఏపీ సీఐడీ కేసులు సరే....ఉద్యోగుల జీపీఎఫ్ మాయంపై కేసులేవీ ?
ఏపీలో మార్గదర్శితో మొదలుపెట్టి జగజ్జననీ వరకూ వరుసగా చిట్ ఫండ్ కంపెనీలపై సీఐడీ కేసులు పెడుతోంది. వీటిపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. ముఖ్యంగా విపక్షాలను, వాటికి అండగా ఉంటున్న మీడియా సంస్ధలకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలపై సీఐడీ చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. అయితే ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ సొమ్మును అధికారులు మాయం చేసినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో వారిపైనా సీఐడీ కేసులు పెట్టాలి కదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్ములు తరలించాయి అని తమకున్న అనుమానంతో.....ఫిర్యాదులు లేకున్నా రాష్ట్రంలో సీఐడీ కేసులు పెట్టి, అరెస్ట్ లు చేస్తోంది. సరే.! మరి ఉద్యోగుల GPF సొమ్ము రూ. 486 కోట్లు వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారు. ఇది నేరం కాదా? అని టీడీపీ నేత ధూళిపాళ్ల ట్వీట్ చేశారు.

చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్ములు తరలించాయి అని తమకున్న అనుమానంతో.....ఫిర్యాదులు లేకున్నా రాష్ట్రంలో CID కేసులు పెట్టి, అరెస్ట్ లు చేస్తోంది. సరే.!
— Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) May 1, 2023
మరి ఉద్యోగుల GPF సొమ్ము రూ. 486 కోట్లు వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారు. ఇది… pic.twitter.com/f0WSxSvtnI
ఏపీలో మార్గదర్శి చిట్స్ పై సీఐడీ కేసులు, సోదాలపై టీడీపీ ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. అయితే సీఐడీ అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాలు జీపీఎఫ్ సొమ్ము కోసం ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు అంశాల్ని కలిపి ప్రస్తావించడం ద్వారా సీఐడీని టార్గెట్ చేసేందుకు ధూళిపాళ్ల ప్రయత్నించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications