JC Prabhakar Reddy: నాకు దూరం కావొద్దు ప్లీజ్ -అనుచరులకు జేసీ స్వీట్ వార్నింగ్..!
ఏపీలో విలక్షణ రాజకీయ నేతల్లో తాడిపత్రి నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన.. ఇప్పుడు సొంత పార్టీతో పాటు కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా గెలిపించుకున్నారు. అంతే కాదు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జేసీ పలు జాగ్ర్తత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తన అనుచరులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ వీడియో విడుదల చేశారు.
ఇసుక గురించి చెప్తున్నా.. మొత్తం తాడిపత్రి నియోజకవర్గంలో 25 మందే ఇసుక తోలుుకుంటున్నారని, వాళ్లంతా తనకు ఆప్తులని, ఐదేళ్లు తనతో పాటే ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇసుక మైనింగ్ మానుకోండని తన అనుచరులకు జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.దయచేసి ఇసుక మైనింగ్ చేయొద్దన్నారు. గతంలో తాను వైసీపీ ప్రభుత్వం ఇసుక మైనింగ్ పై గ్రీన్ ట్రైబ్యునల్ కు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో వీరి దయవల్లే తాను పోలీసు స్టేషన్ నుంచి బయటపడ్డానన్నారు.

"ఇసుక దందాలో నా వాళ్లు 25 మంది ఉన్నారు. అంతా నాకు కావాల్సిన వాళ్లే. నాకు దూరమయ్యే పనులు చేయొద్దు. దయ చేసి ఇసుక తోలడం ఆపండి."
— TDP Digital Media (@TDPDigitalMedia) August 27, 2024
-టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి#JCPrabhakarReddy #Anantapur #Tadipatri #SandMafia pic.twitter.com/Hnl3Ej58WH
తాడిపత్రిలో ఇసుక మైనింగ్ పై ఆదివారం ఏసీబీ అధికారులు విచారణ చేసి వెళ్లారన్నారు. టిప్పర్ ఓనర్లు సైతం బయటికి రావొద్దని జేసీ కోరారు. తన నియోజకవర్గంలో వద్దని, బయట నియోజకవర్గాలకు వెళ్లి తోలుకోవాలని కోరారు. మీరే డబ్బులు చేసుకోవాలా, తానెంత పోగొట్టుకున్నానో తెలుసా అని అడిగారు.మున్సిపాలిటీ ద్వారా ఇసుక తోలిస్తానని, మీకు ఇసుక ఎలా అమ్మాలో కూడా తెలియదన్నారు. వైసీపీ సాయంతోనే వీళ్లు ఇదంతా చేస్తున్నారన్నారు.ఇళ్లకు కావాలంటే ఇసుక తోలుకోవాలని, కానీ బయట మాత్రం చేయొద్దన్నారు. తనకు దూరం కావొద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి వారిని కోరారు. టిప్పర్ ఓనర్లు ఎక్కడున్నా తను వదిలిపెట్టబోనన్నారు.












Click it and Unblock the Notifications