టీడీపీ నేత కూన రవికుమార్ సరెండర్ .. ఆ కేసులో గత వారం రోజులుగా అజ్ఞాతంలో !!

శ్రీకాకుళం జిల్లా టిడిపి నేత , టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఈరోజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. గత ఏడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేత పొందూరు పోలీస్ స్టేషన్ లో ఈరోజు లొంగిపోవడంతో పోలీసులు ఆయనను రాజాం కోర్టుకు తరలించారు.

కోర్టులో కూన రవికుమార్ ను హాజరుపరిచే నేపథ్యంలో రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్ కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించారు . అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల సందర్భంగా పెనుబర్తి అలజడికి కారణం అయ్యాడని పోలీసులు కూన రవికుమార్ పై కేసు నమోదు చేశారు.

TDP leader Kuna Ravikumar surrendered in ponduru police station

పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్ఆర్సిపి ఎంపిటిసి అభ్యర్థి ఇంటి పై అనుచరులతో కలిసి కూన రవికుమార్ దాడి చేశారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో కూన రవికుమార్ గత ఏడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం అజ్ఞాతాన్ని వీడిని ఆయన పోలీసులకు లొంగిపోయారు.

ఇదిలా ఉంటే గత పరిషత్ ఎన్నికల సమయంలో పెనుబర్తి లో టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, ఈ విషయం తెలిసిన కూన రవికుమార్ పెనుబర్తి వెళ్లగా దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. నాడు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పై దుర్భాషలాడిన ఘటనలో 29 మంది టిడిపి నేతల పై కేసు నమోదు చేశారు ఇప్పటికే 20 మంది టిడిపి నేతలను అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+