చెప్పుతో కొడతా: విజయ సాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ సాయి రెడ్డిపై ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ భూస్కాంపై తనపై వైసిపి నేతలు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు.

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ సాయి రెడ్డిపై ఎమ్మెల్యే బండారు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ భూస్కాంపై తనపై వైసిపి నేతలు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు.

నా తండ్రి ఉన్నప్పుడే..

నా తండ్రి ఉన్నప్పుడే..

తన తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా తాము నైతిక విలువలతోనే బతుకుతున్నామన్నారు. భూదాన్ ఉద్యమంలో 10 ఎకరాల భూమిని దానం చేసిన చరిత్ర తమది అన్నారు. 16 నెలలు జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరస్తుడైన విజయసాయి విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

తాను భూకబ్జాలు చేశానన్న విమర్శలకు విజయసాయిరెడ్డి ఆధారాలు చూపించాలని, అడ్డగోలుగా విమర్శలు చేస్తే, సహించేది లేదన్నారు. ఆధారాలు పట్టుకొచ్చి మీడియా ముందు నిరూపిస్తే ఉరి వేసుకుంటానని ఇప్పటికే చెప్పానని, అయినా మళ్లీ అదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

నీలా దొంగ ముద్రతో రాలేదు

నీలా దొంగ ముద్రతో రాలేదు

తాను కాని, తన కుటుంబసభ్యులు కాని, తన బంధువుల కాని భూములు కబ్జా చేసినట్టు నిరూపిస్తే, వైసిపి కార్యాలయంలో బండ్రోతుగా పని చేస్తానని సవాల్ విసిరారు. జైల్లో ఉండి చిప్ప కూడు తిని, బెయిల్లో ఉన్నావు, మళ్లీ ఎప్పుడు జైలుకు వెళతావో, నీ బతుకేందో నీకే తెలియదు, నువ్వా నాపై ఆరోపణలు చేసేది అని మండిపడ్డారు.ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని తీవ్రంగా హెచ్చరించారు. తాను ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశానని తెలిపారు. ఆయనలా దొంగ ముద్రతో రాజకీయాల్లోకి రాలేదన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించమన్నారు.

వైసిపి నేతలు విమర్శించడమా

వైసిపి నేతలు విమర్శించడమా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి అంటూ విమర్శలు చేయడం విడ్డూరమని మంత్రి శిద్ధా రాఘవ రావు విమర్శించారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

ప్రతి విషయాన్ని రాద్దాంతం చేయడమా?

ప్రతి విషయాన్ని రాద్దాంతం చేయడమా?

ప్రతి విషయాన్ని రాద్దాంతం చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని శిద్ధా రాఘవ రావు అన్నారు. అధికారంలోకి వస్తామని వైసిపి నేతలు కలలు కంటున్నారన్నారు.

25 ఏళ్లు సీఎంగా చంద్రబాబే

25 ఏళ్లు సీఎంగా చంద్రబాబే

మరో ఇరవై అయిదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారని శిద్ధా రాఘవ రావు ధీమా వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు 2018 కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది దొనకొండ ఇండస్ట్రీయల్ కారిడార్‌కు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+