వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్! జగన్‌తో వెళ్తే జాగ్రత్త: టీడీపీ వార్నింగ్, లక్నోలో జనసేనాని బిజీ (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

అమరావతి/లక్నో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఓ పెద్ద లీడర్‌ను కావాలని రాజకీయాల్లోకి వచ్చారని తెలుగుదేశం పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప బుధవారం అన్నారు. ఆయన పెద్ద నాయకుడిగా కావాలంటే తన సూచన పాటించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటారని ప్రచారం సాగుతోంది.

వారు ఔట్.. పవన్ కళ్యాణ్ ద్విముఖ వ్యూహం, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మాయావతితో భేటీ!వారు ఔట్.. పవన్ కళ్యాణ్ ద్విముఖ వ్యూహం, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మాయావతితో భేటీ!

దీనిని ఉద్దేశించి చినరాజప్ప మాట్లాడారు. జగన్‌తో జనసేనాని పొత్తు పెట్టుకుంటే ఆయన వెనుక ఎవరూ ఉండరని హెచ్చరించారు. ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తుఫాన్ బాధితులకు నష్టపరిహారం పంపిణీ చేస్తామని చెప్పారు.

ఓ వైపు ఆరోపణలు, మరోవైపు హెచ్చరికలు

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీకి మద్దతు పలికారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం ఆయన టీడీపీ, బీజేపీ, వైసీపీలపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే, బీజేపీ చెప్పినట్లు జగన్, పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వారు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వారే ఆరోపణలు చేస్తూ తిరిగి జగన్‌తో వెళ్తే ఎవరూ ఉండరని వాళ్లే జాగ్రత్తలు చెబుతున్నారు.

పలు ప్రదేశాలు సందర్శిస్తూ బిజీ

ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం హుటాహుటిన ఉత్తర ప్రదేశ్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో భేటీ అవుతారని చర్చ సాగుతోంది. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నంలో భాగంగా ఆయన లక్నోకు వెళ్లారని చెబుతున్నారు. పవన్ బుధవారం లక్నోలో పలు ప్రదేశాలు సందర్శిస్తూ బిజీగా గడిపారు. పవన్ లక్నోలోని డాక్టర్ బీంరావ్ అంబేడ్కర్ మెమోరియల్ పార్క్‌ను సందర్శించారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్

డాక్టర్ బీంరావ్ అంబేడ్కర్ మెమోరియల్ పార్క్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడి రాజ్యాంగ నిర్మాత ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మహాత్మా జ్యోతిరావుపులే కోట్స్ అంటూ మరో ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల, విద్యార్థులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పార్టీలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు నిపుణులతో కలిసి లక్నో వెళ్లారు. వారితో కలిసి బీంరావ్ అంబేడ్కర్ పార్క్‌ను సందర్శించారు.

English summary
Telugudesam Party leader and Home Minister Chinna Rajappa suggestion to Jana Sena chief Pawan Kalyan over 2019 general elections alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X