విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి కొడాలి నానిపై ఎదురుదాడి - విజయవాడ సీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు-తొలిసారి నారా లోకేశ్ రియాక్షన్

|
Google Oneindia TeluguNews

ఊచకోత తరహాలో చంద్రబాబు, నారా లోకేశ్ సహా ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడే మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. వ్యూహాత్మకంగా ముందు పోలీసుల చెంతకు, తర్వాత గవర్నర్ వద్దకు వెళ్లాలని డిసైడైంది. అవసరమైతే కోర్టులోనూ అమీతుమీ తేల్చుకునే దిశగానూ అడుగులు వేస్తున్నది. మంత్రి హోదాలో ఉండి, కొడాలి వాడుతోన్న భాషపైనే టీడీపీ అభియోగాలు చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా పంచలేనప్పుడు అమరావతిని శాసన రాజధానిగా ఉండా ఉంచరాదంటూ కొడాలి చేసిన కామెంట్లపై ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదు కావడం తెలిసిందే.

చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా 'వార్'నింగ్చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా 'వార్'నింగ్

విజయవాడ సీపీకి ఫిర్యాదు..

విజయవాడ సీపీకి ఫిర్యాదు..

మంత్రి కొడాలి నాని అప్రజాస్వామిక, అసభ్యకరమైన భాషను అలవాటుగా వాడుతున్నారని, సభ్యసమాజం సహించలేని రీతిలో మాట్లాడుతోన్న ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ సీనియర్ నేతలు.. విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీపీని కలిసినవారిలో వర్ల రామయ్య, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు ఉన్నారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను తెలిపారు.

డీజీపీని కలవాలనుకున్నా..

డీజీపీని కలవాలనుకున్నా..

కొడాలి నిత్యం అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఎంతకీ కదలిక లేకపోవడంతో తామే ఫిర్యాదు చేస్తున్నామని టీడీపీ నేతలు చెప్పారు. నిజానికి మంత్రి వ్యవహారశైలిపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలవాలనుకున్నా, ఆయన బిజీగా ఉండటంతో విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ పోలీసులుగానీ మంత్రిపై చర్యలు తీసుకోకపోతే.. గవర్నర్‌ను కూడా కలుస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

నాని మమ్మల్ని చంపుతారా?

నాని మమ్మల్ని చంపుతారా?

‘‘మంత్రి కొడాలి నాని వాడుతున్న భాష అప్రజాస్వామికం. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తామంటారా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అయితే, నన్ను కూడా చంపేస్తారా?''అని వర్ల రామయ్య మండిపడ్డారు. ‘‘కొడాలిపై పోలీసులు చర్యలు తీసుకుంటారేమోనని ఎదురుచూశాం. కానీ అటు నుంచి స్పందన లేదు. డీజీపీ పనిలో ఉన్నానని చెప్పడంతో సీపీని కలిశాం. మంత్రిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం''అని బచ్చుల అర్జునుడు తెలిపారు.

 కొడాలికి లోకేశ్ వార్నింగ్..

కొడాలికి లోకేశ్ వార్నింగ్..

టీడీపీ నేతలు విజయవాడ సీపీని కలిసి మంత్రిపై ఫిర్యాదు చేయడానికి కొన్ని గంటల ముందు... టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తొలిసారి కొడాలి నాని కామెంట్లపై స్పందించారు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లొచ్చిన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నారా లోకేశ్ బుధవారం పరామర్శించారు. విజయవాడ కరెన్సీ నగర్ లోని రవీంద్ర ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన లోకేశ్.. మంత్రి నానికి వార్నింగ్ ఇచ్చారు. ‘‘కొడాలి నానికి ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైంది. అందుకే అందరి పైనా దుర్బాషలాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటే మంచిది'' అని హెచ్చరించారు.

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌పై సీరం క్లారిటీ - భారత్‌లో ట్రయల్స్ ఆగవు - అసలు కారణం ఇదేఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌పై సీరం క్లారిటీ - భారత్‌లో ట్రయల్స్ ఆగవు - అసలు కారణం ఇదే

English summary
tdp leader varla ramaiah, bachula arjunudu ashok babu on wednesday file a complaint with vijayawada police commissioner on minister kodali nani. tdp accused that minister nani is using filthy language. leaders said, if police do not take any action against minister, they will approach governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X