'పోసాని! నిజాలు తెలుసుకో, ఆస్తుల రక్షణకు లోకేష్‌ను పావుగా వాడుకుంటారా'
నంది అవార్డుల వివాదంపై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి పైన తెలుగుదేశం పార్టీ నేతలు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోసాని వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
అమరావతి: నంది అవార్డుల వివాదంపై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి పైన తెలుగుదేశం పార్టీ నేతలు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోసాని వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
Recommended Video


పోసాని నిజాలు తెలుసుకో
పోసాని నిజాలు తెలుసుకొని మాట్లాడాలని టీడీపీ నేత, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ బషీర్ అహమ్మద్ హితవు పలికారు. నంది అవార్డుల విషయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను పోసాని తప్పుబట్టడం సరికాదన్నారు.

ఆస్తుల రక్షణ కోసం లోకేష్‌ను విమర్శిస్తున్నారని ట్విస్ట్
మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు చేయవద్దని బషీర్.. పోసానికి సూచించారు. ఆయన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మీ ఆస్తుల పరిరక్షణ కోసం లోకేష్‌ను పావుగా వాడుకోవద్దని, అలాంటి ఆలోచనలు చేస్తే సహించేది లేదన్నారు.

పోసాని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ ప్రోద్బలం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోసాని కృష్ణమురళీ మంత్రి లోకేష్‌ను విమర్శిస్తున్నారని మరో టీడీపీ నేత నాగేంద్ర అన్నారు. నంది అవార్డులపై పోసానికి అవగాహన ఉంటే ఇలా మాట్లాడి ఉండే వారు కాదన్నారు.

లోకేష్ ఇలా, పోసాని అలా
కాగా, నంది అవార్డుల వివాదంపై లోకేష్ ఇటీవల మాట్లాడుతూ.. హైదరాబాదులో కూర్చొని విమర్శిస్తారా, ఏపీలో ఆధార్, రేషన్ కార్డు లేని వారు మాట్లాడుతున్నారని, వారు నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రా అని వ్యాఖ్యానించారు. దీనిపై పోసాని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో టీడీపీ నేతలు స్పందిస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications