వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి పరుడికి అండగానా: సర్వేపై టిడిపి ఫైర్

|
Google Oneindia TeluguNews

TDP Leaders fires at a TV Channel Survey
హైదరాబాద్: తమ పార్టీని ఉద్దేశించి ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ సంస్కృతికి నాంది పలికేందుకే ఈ సర్వేలని వారు ఆరోపించారు. ఇండియాటుడే చెప్పిన సర్వే ఒక్క రోజులోనే మారుపోతుందా అని వారు ప్రశ్నించారు.

ఆ ఛానెల్ నిర్వహించిన సర్వేపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అసలు సర్వే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. జైలు నుంచి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్‌ను పెంచేందుకే ఈ సర్వే చేసినట్లుందని వారు ఆరోపించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అసహ్యంచుకుంటున్నారని అన్నారు. అలాంటి నాయకుడ్ని ఎందుకు సమర్థిస్తున్నారో తెలియడం లేదని అన్నారు.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు జిల్లాలో మాత్రమే ఆధిక్యం వచ్చిందని తెలిపారు. మిగితా 21 జిల్లాల్లో తెలుగుదేశం ఆధిక్యతను చాటుకుందని వారు చెప్పారు. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడోస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలున్నాయని తెలిపారు. అవినీతి నాయకుడ్ని ప్రోత్సహించే విధంగా ఇప్పుడు ఈ సర్వేలు చేయడం ధర్మమా అని వారు ప్రశ్నించారు.

సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, వాళ్లకు అనుకూలంగా సర్వేలు చేసిందని ఆరోపించారు. మీ డ్యూటీ మీరు చేశారు.. మా డ్యూటీ మేం చేస్తామని మీడియాతో గాలి ముద్దుకృష్ణమ అన్నారు. అవినీతి, లూటీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశించారు. దేశంలో సంపన్నులైన టాటా, బిర్లాల కంటే ఎక్కువగా పన్నును చెల్లించి మూడవ స్థానంలో జగన్ ఉన్నాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒక అవినీతికి మద్దతుగా సర్వే నిర్వహించడం దారుణమని గాలి ముద్దుకృష్ణమ అన్నారు.

English summary
TDP Leaders Gali Muddu Krshnama Naidu, Bojjala Gopala krishnareddy, Gorantla Buchaiah choudary fired at a TV Channel Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X