టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలకు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఇటీవలే తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలిక‌పూడి శ్రీనివాస్‌కు ఘోర అవమానం ఎదురైంది. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కొలిక‌పూడి శ్రీనివాస్‌ కోరగా, అక్కడే ఉన్న ప్రజలు తాము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని చెప్పి..ఆ టీడీపీ నేతకు షాకిచ్చారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

టీడీపీకి ఓటు వేయాలని వచ్చిన నేతలను ఓ సాధారణ మహిళ తన ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. వైసీపీ పాలనకు , టీడీపీ పాలనకు తేడాలు వివరిస్తూ ఆ నేతలను ఓ ఆట ఆడుకుంది. మీరు ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు చూశారు.. ఎప్పుడైనా ఇలాంటి పాలన చూశారా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించింది ఆ మహిళ. 1 తేదీనే ఉదయం 7 గంటలకే పింఛన్లు తలుపు కొట్టి మరీ అందిస్తున్నారని ఆ మహిళ తెలిపింది.

tdp leaders had a bitter experience during the election campaign

టీడీపీ హయంలో జన్మభూమి కమిటీలు పెట్టారు.. ప్రజల వద్దకు పాలన పెట్టారు...పసుపు కుంకమ అని పేరు పెట్టి పసుపు జెండాలతో కదిలి రండి తెలుగు దేశం కార్యకర్తల్లారా అంటూ రోడ్ల మీద తిరిగారని టీడీపీ నేతలపై ఆమె సెటైర్లు వేశారు. ఏ చిన్న పథకం పెట్టినా డ్వాక్రా మహిళలను బస్సుల్లో తరలించేవారని..ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఊరు దాటి వెళ్తుందా అని టీడీపీ నేతలను ఆ మహిళ ప్రశ్నించింది.

https://www.facebook.com/reel/1489266545330495

టీడీపీ హయంలో ఏ పథకం ఇవ్వాలన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, సర్పంచ్ వీరందరూ ఉంటనే ఆ పథకం చేతికి అందేది కాదు. కానీ ఇప్పుడు అవన్నీ ఉన్నాయా..? ఎవరితోనూ పని లేదు. అన్ని పథకాలు నేరుగా అకౌంట్‌కే చేరుతున్నాయని ఆ మహిళ తెలిపింది. ఆ మహిళ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతల నుంచి సమాధానం కరువైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+