చంద్రబాబు బయటకు వచ్చేది అప్పుడేనా - అదొక్కటే ఆశ..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు బయటకు వచ్చేది ఎప్పుడు. సరిగ్గా చంద్రబాబు జైలు జీవితం నెల రోజులు పూర్తయింది. తొలి రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టుల్లో విచారణ సాగుతోంది. తాజాగా ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్స్ డిస్మిస్ అయ్యాయి. సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్ పైన విచారణ కొనసాగుతోంది. తాజా పరిణామాలతో టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు బయటకు రావటం కోసం ఒకే ఆశ వారిలో కనిపిస్తోంది.

బెయిల్ పిటీషన్ల డిస్మిస్: చంద్రబాబు వరుసగా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు గొడవలు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ స్కాంలో చంద్రబాబు పైన కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కాంలో అరెస్ట్ తరువాత ఈ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. విచారణ తరువాత ఈ రోజు హైకోర్టు ఆ పిటీషన్లను తిరస్కరించింది.

TDP Leaders in tension situation over Chandra Babu bail ahead Assembly Elections

ఇక, తొలి నుంచి క్వాష్ కోసం ప్రయత్నం చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు లో బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. అటు సీఐడీ కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేసిది. ఏసీబీ కోర్టు విచారణ చేసి ఈ రెండు పిటీషన్లను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో, ఇప్పుడు హైకోర్టు తిరస్కరించిన బెయిల్ పిటీషన్ల పైన సుప్రీంకు వెళ్లాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు నిర్ణయించారు.

సుప్రీంలో వాదనలు: సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. 17ఏ కు విరుద్దంగా చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటూ తొలి నుంచి వాదిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు..తాజా వాదనల్లో ఇదే అంశం పైన బలంగా తమ వాదనలు వినిపించారు. ఈ అంశం పైన న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తరపు న్యాయవాదలు వాదన ముగియటంతో..రేపు (మంగళవారం) సీఐడీ తరపు ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపించనున్నారు.

ఆ తరువాత సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అటు సీఐడీ ఇప్పటికే లోకేశ్ కు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో విచారణకు కోర్టు సూచనల మేరకు నోటీసులు ఇచ్చింది. దీంతో, సీఐడీ ఎదుట లోకేశ్ హాజరు కావాల్సి ఉంది. హైకోర్టులో బెయిల్ పిటీషన్లు తిరస్కరించటంతో సీఐడీ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది.

టీడీపీ నేతల్లో ఉత్కంఠ: ఈ మొత్తం పరిణామాల పైన టీడీపీలో చర్చ సాగుతోంది. నెల రోజులు పూర్తయినా ఇంకా చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనేది అంతు చిక్కని అంశంగా నేతలు భావిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వరుస కార్యక్రమాలను ప్రకటించారు. జనవరి నుంచి ఎన్నికల లోగా వరుసగా పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించారు.

వివిధ మార్గాల్లో కేడర్ మొత్తం ప్రజల మధ్యనే ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అటు పొత్తు ప్రకటన తరువాత పవన్ యాత్రకు స్పందన తగ్గినట్లు చర్చ సాగుతోంది. దీంతో, టీడీపీలో మరింత టెన్షన్ పెరిగిపోతోంది. అయితే, సుప్రీంలో క్వాష్ పిటీషన్ కు అనుకూలంగా తీర్పు వస్తే సరే...లేకుంటే ఏ రకంగా ముందుకెళ్లాలనేది ఇప్పుడు ముందస్తు ఆలోచనలు చేస్తున్నారు. దీంతో, సుప్రీంలో ఎటువంటి తీర్పు వస్తుంది.. చంద్రబాబు అసలు ఎప్పుడు బయటకు వస్తారు..ఎన్నికల వేళ ఈ పరిస్థితి ఏంటనే డైలమా మాత్రం పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+