వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ కు టీడీపీ నేతల నయా డిమాండ్ .. అమ్మ ఒడి వద్దు ఆక్సిజన్ కావాలి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. ఏ జిల్లాలో చూసినా దారుణంగా మారిన కరోనా పరిస్థితులతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు అంటూ చెప్తున్నారు.

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయంకరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

వసతి దీవెన బదులు ఆసుపత్రిలో వసతి కల్పించాలని కోరిక

వసతి దీవెన బదులు ఆసుపత్రిలో వసతి కల్పించాలని కోరిక


తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు అమ్మఒడికి బదులు ఆక్సిజన్ ఇవ్వమంటున్నారు అని పేర్కొన్నారు. అంతేకాదు వసతి దీవెన బదులు ఆసుపత్రిలో వసతి కల్పించాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు రేపటికి బతుకుతామని భరోసా కల్పించమని అంటున్నారని ఆయన చెప్పారు. ఇక ఇంటింటికి రేషన్ ఇచ్చే బదులు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు.

సున్నా వడ్డీ వద్దు సున్నా మరణాలు ఉండేలా చూడాలి

సున్నా వడ్డీ వద్దు సున్నా మరణాలు ఉండేలా చూడాలి

సున్నా వడ్డీ వద్దు సున్నా మరణాలు ఉండేలా చేయమంటున్నారు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అద్వాన పరిస్థితుల్లో ప్రజలు ఉంటే, ప్రజల దృష్టిని మరల్చేందుకు కావాలని చంద్రబాబుపై కేసులు పెడుతున్నారని ఆనంద్ బాబు మండిపడ్డారు. ఇక చంద్రబాబుపై కేసులు పెట్టడం ఫ్యాషన్ అయిపోయిందని, కేసులతో ఏమీ సాధించలేరు అని, అవినీతి చేశామని మీడియాలో విష ప్రచారం తప్ప ఏమీ చేయలేరని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అసహనం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే క్రమంలోనే కుయుక్తులు

సీఎం జగన్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే క్రమంలోనే కుయుక్తులు

కరోనా యాక్టివ్ కేసుల జాబితాలో రాష్ట్రం ఆరో స్థానంలో ఉందని, రోజువారీ కేసుల పెరుగుదలలో నాలుగవ స్థానంలో ఉందని నక్కా ఆనందబాబు తెలిపారు. ఇక వ్యాక్సినేషన్ పంపిణీలో 28వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. సమస్య తీవ్రతను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే పాలకులు కుయుక్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్ ల కోసం లేఖలు రాస్తే సరిపోతుందా ?

వ్యాక్సిన్ ల కోసం లేఖలు రాస్తే సరిపోతుందా ?


ఇదే సమయంలో గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చేశారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కులం ఆపాదించడం సిగ్గుచేటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ కళకు సంబంధించి ముందస్తు చెల్లింపులు ఆర్డర్లు పెట్టకుండా లేఖలకు పరిమితమయ్యారని , వ్యాక్సిన్ కొనుగోలుకు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తే 45 కోట్లు మంజూరు చేస్తారా అంటూ మండిపడ్డారు. కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు లేని ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చేయండి ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Corona epidemic booms in Andhra Pradesh Currently there is a health emergency in Andhra Pradesh. The people of AP are reeling from the corona conditions that have become worse . In this context, the Telugu Desam party leaders are hearing a new demand in the light of the current situation in the state of Andhra Pradesh. People say they want the same. tdp leader, former minister nakka anand babu demanded that the people demands to give oxygen instead of amma odi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X