అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు! చేయించింది టీడీపీ నేతలు!?

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమండ్రి: అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలకు తెరలేపడం జాతరలో పాల్గొన్న భక్తులకు ఆగ్రహం కలిగించింది. ఈ అసాంఘిక కార్యక్రమాన్ని అధికారిపార్టీ నాయకులే నిర్వహించడం మరీ విస్మయం కలిగిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో టీడీపీ నేతలు అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా రెండు స్టేజీలు ఏర్పాటు చేసి యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు.

TDP Leaders organized Profane Dances in Ammavari Jatara!

అంతేకాదు పేకాట, గుండాటలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వాహకులు టీడీపీ నేతలు కావడంతో పోలీసులు కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలను చూసిచూడనట్లు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

స్థానిక ప్రజలు కూడా టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి జాతరను భక్తిప్రపత్తులతో ఎంతో పవిత్రంగా నిర్వహించాల్సింది పోయి ఈ అసభ్య కార్యక్రమాలేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
People of the Sringarayunipalem of Kirlampudi Mandal, East Godavari critisizing TDP Leaders on conducting uneventful programs in Ammavari Jatara. While jatara is going on some tdp leaders organized profane dances on two stages and they conducted bingo with playing cards. Local police also ignored this as the organizers are from TDP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి