వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలవివాదాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారం అవుతుందా? జగన్ కు టీడీపీ నేతల సూటి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జలవివాదాలు ఇంకా సద్దుమణగలేదు. ఇటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ జల దోపిడీపై చాలా సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై చర్చించారు. ఇక ఈ నెల 9వ తేదీన జరగనున్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం వాయిదా వేయమని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.

అప్పుడు ప్రగతి భవన్ లో బిర్యానీ తిన్నప్పుడు తెలీదా జగన్ ..తెలంగాణాతో జల వివాదాలపై దేవినేని ఉమా ధ్వజంఅప్పుడు ప్రగతి భవన్ లో బిర్యానీ తిన్నప్పుడు తెలీదా జగన్ ..తెలంగాణాతో జల వివాదాలపై దేవినేని ఉమా ధ్వజం

 జలవివాదాలపై టీడీపీ వర్సెస్ వైసీపీ

జలవివాదాలపై టీడీపీ వర్సెస్ వైసీపీ

తాజా పరిణామాలపై ఆంధ్రప్రదేశ్లోనూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలకు కారణం నాటి సీఎం చంద్రబాబు నాయుడేనని వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే, జగన్ తెలంగాణలో ఉన్న తన ఆస్తులను పరిరక్షించుకోవడం కోసమే తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, వైయస్సార్ ను తిట్టిపోస్తున్నా సైలెంట్ గా ఉంటున్నారంటూ టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద టీడీపీ ఆందోళన

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద టీడీపీ ఆందోళన


తాజాగా కృష్ణా జలాలను వృధా చెయ్యటంపై విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర టిడిపి నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జలాలను వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారంటూ జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నారుమళ్లకు నీరు ఇవ్వకుండా కృష్ణా నికర జలాలను సముద్రం పాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో పాటు రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

జల జగడాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారం అవుతుందా ?

జల జగడాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారం అవుతుందా ?

ఈ సందర్భంగా టిడిపి నేతలు ఏపీ సర్కార్ కు సూటి ప్రశ్న సంధించారు. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల వివాదాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటూ ప్రశ్నించారు టిడిపి నేతలు. ధూళిపాళ్ల నరేంద్ర జగన్ సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రైతుల ప్రయోజనాలు కాపాడేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించటం లేదంటూ మండిపడ్డారు. రైతులకు ఇవ్వవలసిన నీటిని సముద్రం పాలు చేయడం దుర్మార్గమని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు ?

అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు ?

ఇదే సమయంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని జగన్ సర్కార్ ను నిలదీశారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు కేవలం లేఖలతో పరిష్కారమవుతాయా అని ప్రశ్నించిన టిడిపి నేతలు జగన్ మౌనం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోంది అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించాలంటే సీఎం జగన్ నోరు విప్పాలంటూ టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

English summary
TDP leaders staged an agitation near Prakasam Barrage in Vijayawada on Krishna water war. TDP leaders questioned Will writing letters on water disputes solve the problem? Why is CM Jagan not demanding an apex council meeting be arranged?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X