అలా చెప్పడం ఏమిటి, జగన్‌కు బుర్రలేదు: సవాల్‌పై ధీటుగా స్పందించిన టీడీపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బుర్రలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. 45 ఏళ్ల వయస్సున్న వారికి పెన్షన్ ఇస్తామని చెబుతున్నారని, అసలు పెన్షన్ ఎవరికి ఇస్తారో తెలుసా అని ప్రశ్నించారు.

AP Assembly Sessions Started Without Opposition YSRCP | Oneindia Telugu

అదే నిజమైతే 'భారతి' మాటేమిటి: పాదయాత్ర, జగన్‌కు దిమ్మతిరిగే ప్రశ్నలు!

 ముఖ్యమంత్రిని అవుతానని చెప్పడం ఏమిటి

ముఖ్యమంత్రిని అవుతానని చెప్పడం ఏమిటి

జగన్‌పై మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు తీరుస్తానని, తనకు అవకాశమివ్వాలని జగన్ కోరాలి కానీ ముఖ్యమంత్రిని అయిపోతానని చెప్పడం ఏమిటని పితాని ఎద్దేవా చేశారు.

ఇది బాధాకరం

ఇది బాధాకరం

జగన్‌కు ఏమాత్రం రాజకీయ అవగాహన లేదనడానికి ఇదే నిదర్శనమని మంత్రి పితాని అన్నారు. ప్రజాసమస్యలు చర్చించడానికి వేదికైన అసెంబ్లీ సమావేశాలను పక్కనపెట్టి జగన్‌ పాదయాత్ర చేయడం బాధాకరమన్నారు.

 జగన్‌కు నేను చాలు

జగన్‌కు నేను చాలు

జగన్‌ను అవినీతిపరుడిగా, ఆర్థిక ఉగ్రవాదిగా నిరూపించే సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వర్ల రామయ్య ఆయనకు సవాల్‌ విసిరారు. జగన్‌కు చంద్రబాబు స్థాయి వ్యక్తి అవసరం లేదని, నేను చాలు అన్నారు.

 జగన్ సవాల్ పైన

జగన్ సవాల్ పైన

జగన్‌ పాదయాత్రలో భాగంగా బుధవారం తనకు విదేశాల్లో పెట్టుబడులున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ సవాల్‌ విసరడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని వర్ల అన్నారు.

చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయాలి

చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయాలి

జగన్‌ పేరు నిమ్మగడ్డ ప్రసాద్‌ తదితరులతో కలిసి పారడైజ్‌ పత్రాలలో ఉటంకిస్తే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయాలని వర్ల ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలను తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్‌దే అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leaders targetted YS Jaganmohan Reddy for challenging Chandrababu
Please Wait while comments are loading...