వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ..ఎన్టీఆర్ టిడిపికి దూర‌మైనట్లేనా:ఎన్నిక‌ల వేళ టిడిపి లో క‌ల‌క‌లం:ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ టిడిపి లో ఆస‌క్తి క‌ర‌మైన చ‌ర్చ‌. టిడిపి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తే బాగుంటుం ది. మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మెజార్టీ టిడిపి నేత‌లు చెబుతున్న మాట ఇదే. అయితే, 2009 ఎన్నిక‌ల త‌రువాత జూనియ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన లేదు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు . ఆయ‌న ఇక టిడిపికి సైతం దూర‌మైనట్లేనా...

టిడిపి లో జోష్ కావాలి...

టిడిపి లో జోష్ కావాలి...

ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైసిపి నుండి జ‌గ‌న్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. జ‌గ‌న్ స‌భ‌ల‌కు పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌స్తున్నారు. అందులో స‌మీక‌ర‌ణ ఉన్నా..జ‌న స్పంద‌న బాగుంది. ఇక‌, ష‌ర్మిళ‌..విజ‌య‌మ్మ త‌మ వంతు ప్ర‌చారం చేస్తు న్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు టిడిపి నుండి సీనియ‌ర్ల వ‌రుస పెట్టి వైసిపి లో చేరారు. అది కూడా టిడిపి కేడ‌ర్ పై మాన సికంగా దెబ్బ తీసింది. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ రత్నాల‌నే చంద్ర‌బాబు కాపీ కొట్టి అమ‌లు చేస్తున్నార‌నే ప్ర‌చారం క్షేత్ర స్థా యిలో జోరుగా సాగుతోంది. టిడిపి ముందుగానే అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించినా..11 చోట్ల రెబ‌ల్ అభ్య‌ర్దులు బ‌రిలో ఉన్నారు. ఈ స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌ను లెక్క చేయ‌కుండా..ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఎక్క‌డా స‌మాధానం చెప్ప కుండా జ‌గ‌న్ ప్ర‌చారంలో ముందుకు వెళ్తున్నారు. టిడిపి లో ఇప్పుడు ఆ జోష్ క‌నిపించ‌టం లేద‌నేది పార్టీ నేత‌లే అంగీకరిస్త‌న్నారు.

టిడిపిలో ఆ ఇద్దరే..బాల‌య్య అక్క‌డే..

టిడిపిలో ఆ ఇద్దరే..బాల‌య్య అక్క‌డే..

ఇక‌, ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన తాజా ఎన్నిక‌ల్లో టిడిపి నుండి అధినేత చంద్ర‌బాబు..ఆయ‌న త‌న‌యుడు లోకేష్ స్టార్ క్యాంపెయిన‌ర్లు గా ఉన్నారు. హీరో బాల‌కృష్ణ కు క్రేజ్ ఉన్నా..ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు హిందూపురంకే పరిమితం అయ్యా రు. సినీ హీరో తార‌క‌ర‌త్న మాత్రం నెల్లూరు జిల్లాలో ప్ర‌చారం చేసారు. 2014 ఎన్నిక‌ల్లో సైతం స్టార్ క్యాంపెయిన‌ర్లు లేక పోయినా ప‌వ‌న్ క‌ళ్యాన్‌..మోదీ గ్లామ‌ర్ టిడిపికి అద‌న‌పు బ‌లంగా మారింది. టిడిపి అధికారంలోకి వ‌చ్చింది. స‌హ‌జంగా ప్ర‌భుత్వం మీద ఉండే వ్య‌తిరేక‌త ను పూర్తి స్థాయిలో అంచ‌నా వేయ‌లేక‌పోయార‌ని టిడిపి నేత‌లు ఇప్పుడు చ‌ర్చ‌లు చేస్తున్నారు. లోకేష్ ప్ర‌చారానికి పెద్ద‌గా స్పంద‌న ఉండ‌టం లేద‌ని టిడిపి నేత‌లు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అంగీక‌రిస్తున్నా రు. ఈ స‌మ‌యంలో.. పార్టీ కేడ‌ర్ లో జోష్ నింపే ప్ర‌చారం చేసే వారు కావాల‌ని కోరుకుంటున్నారు. కేవ‌లం చంద్ర బాబు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయ‌లేర‌న్న‌ది వారి వాద‌న‌.

జూనియ‌ర్ ను గుర్తు చేసుకుంటూ..

జూనియ‌ర్ ను గుర్తు చేసుకుంటూ..

2009 ఎన్నిక‌ల స‌మయంలో టిడిపి త‌ర‌పున జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం చేసిన సంద‌ర్భాన్ని పార్టీ నేత‌లు గుర్తు చేసు కుంటున్నారు. తాత త‌ర‌హాలోనే వేష ధార‌ణ‌లో జూనియ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేసారు. తొలి సారి ప్ర‌చారంలో పాల్గొం టున్నా..ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ఆయ‌న స‌భ‌ల‌కు విశేష స్పంద‌న ల‌భించింది. అయితే, అదే ప్ర‌చార క్ర‌మం లో ఖ‌మ్మం వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో జూనియ‌ర్ గాయ‌ప‌డ్డారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి లోకేష్ ఎంట్రీ తో జూనియ‌ర్ ను ప‌క్క‌న పెట్టార‌నే ప్ర‌చారం పార్టీలో ఉంది. ఇక‌, ఈ ఎన్నిక‌ల‌కు సైతం జూనియ‌ర్ ను పార్టీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయాల‌ని పార్టీ ఆహ్వానించ లేదు. లోకేష్ కు జూనియ‌ర్ పోటీ కాకూడ‌ద‌న్న‌ది పార్టీ అధినాయ‌క‌త్వ భావ‌న‌గా చెబుతా రు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సోద‌రి సుహాసిని ఎన్నిక‌ల్లో నిల‌బ‌డినా..కేవ‌లం లేక ద్వారా పిలుపు మాత్ర‌మే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జూనియ‌ర్ ప్ర‌చారానికి మాత్రం వెళ్ల‌లేదు. ఇప్పుడు జూనియ‌ర్ తో పాటుగా క‌ళ్యాణ రాం సైతం ఈ ఎన్నిక‌ల్లో టిడిపికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌టం లేదు. దీంతో..జూనియ‌ర్ పూర్తిగా టిడిపిక దూర‌మైనట్లేనా అనే ప్ర‌చారం టిడిపి లో మొద‌లైంది.

English summary
Famous cine actor Junior NTR maintaining distance from TDP. Party did not invited him for campaign. Now party leaders remembering Junior campaign in 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X