కిరణ్‌పై చంద్రబాబు మల్లగుల్లాలు: సీమాంధ్ర కాంగ్‌పై డౌట్

TDP may move No Trust Motion against Kiran government
హైదరాబాద్: కేంద్రంపై సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి వేడి రాజేసిన నేపథ్యంలో అదే దారిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో నడిచే అవకాశాలపై మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే ఆలోచనను పలువురు తెదేపా నేతలు చేస్తున్నారు. దీనిని ఇప్పటికే వారు అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.

సోమవారం అవిశ్వాస తీర్మానంపై విలేకరులు ప్రశ్నించగా చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ ఎంపీలు కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత తాము పరిశీలిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే తమకు చాలా సంతోషమని వ్యాఖ్యానించారు. తద్వారా టిడిపి అవిశ్వాసంపై యోచిస్తున్నట్లుగా భావిస్తున్నారు.

ఈ నెల 12వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అవిశ్వాసం పెడితే సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు, మంత్రులు ఎందరు తమతో కలిసి వస్తారనే విషయంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకురాగా ఆయన సాధ్యాసాధ్యాలపై చర్చించాక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాక, సరైన మద్దతు లభించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా మద్దతిచ్చిన సీమాంధ్ర కాంగ్రెసు నేతల పైన అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశముందని, అప్పుడు తెలంగాణ బిల్లుకు మరింత సాఫీ అవుతుందని పలువురు సీమాంధ్ర టిడిపి నేతలు భావిస్తున్నారు.

అవిశ్వాసం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కిరణే కొనసాగినప్పటికీ ముఖ్యమైన తెలంగాణ బిల్లు మాత్రం చర్చించే అవకాశం ఉండదని పలువురు సీమాంధ్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, తమ అవిశ్వాసానికి సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధుల నుండి ఎంత వరకు మద్దతు లభిస్తుందనే చర్చ కూడా సాగుతోంది. కిరణ్ బలంగా సమైక్యవాదం వినిపిస్తున్నందున ఆ సాకు చూపి తప్పించుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+