వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభ్యత్వం 50 లక్షలకు పైగా: నారా లోకేష్ జోష్, టిఆర్ఎస్‌కు చురకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 50 లక్షలు దాటినట్టు కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ సోమవారం నాడు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. పలువురు నేతలు పార్టీ సభ్యత్వ లక్ష్యాలను అధిగమించినందుకు లోకేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేకల హర్షకిరణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపునకు కార్యకర్తలు స్పందించిన తీరు అమోఘమని నారా లోకేష్ అన్నారు. 2012లో 9.50 లక్షల మంది సభ్యత్వం చేసుకోగా, నేడు 50 లక్షలకు చేరుకోవడం అద్భుతమని అన్నారు.

కాగా, తెలుగుదేశంపార్టీ కార్యకర్తల సాధకభాధకలను నేరుగా అధినేత దృష్టికి తీసుకుని వచ్చేందుకు 30మందితో కూడిన ప్రత్యేక విభాగాన్ని నియమించింది. ఈవిభాగానికి హెల్స్‌లైన్‌ ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం నుంచి ఈ విభాగం పనిచేస్తోందని టిడిపియువనేత నారా లోకేష్‌ వెల్లడించారు. తాను టిడిపి కార్యాలయాన్ని కార్పోరేట్‌ కార్యాలయంగా మార్చామన్న ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం లేదని ఆయన అంతకు ముందు అన్నారు. టిడిపి కార్యకర్తల స్పందను చూస్తే నలభై నుంచి యాభై లక్షల సభ్యత్యం నమోదు కావడం ఇతర పార్టీల నేతలను కంగుతినిపిస్తోందని, టిడిపి పార్టీ కార్యకర్తలను ఆదుకుంటున్న తీరు ఇతర పార్టీ నేతలను కార్యకర్తలు నిలదీస్తున్నారని, నాయకులు సమాధానం చెప్పుకోలేక పారిపోతున్నారని అన్నారు.

టిడిపి జెండా రెపరెపలు

టిడిపి జెండా రెపరెపలు

టిడిపి సభ్యత్వం 50 లక్షలకు పైగా చేరుకుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ చెప్పారు.

ఎన్టీఆర్‌కు నివాళులు

ఎన్టీఆర్‌కు నివాళులు

నారా లోకేష్ తన తాత, టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

టిఆర్ఎస్‌కు చురకలు

టిఆర్ఎస్‌కు చురకలు

టిడిపిని అంతం చేయాలని చూస్తున్న కొన్ని పార్టీలు ప్లీనరీలు కూడా నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నాయని నారా లోకేష్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు చురకలు అంటించారు.

కేక్ కట్ చేశారు...

కేక్ కట్ చేశారు...

టిడిపి సభ్యత్వ నమోదు గురించి వెల్లడించిన సందర్భంగా నారా లోకేష్ భారీ కేక్ కట్ చేసి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

కళా వెంకట్రావుకు తినిపించారు..

కళా వెంకట్రావుకు తినిపించారు..

భారీ కేక్‌ను కట్ చేసిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావుకు స్వీట్ తినిపించారు.

నారా లోకేష్‌కు తినిపించారు..

నారా లోకేష్‌కు తినిపించారు..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకటరావు కేక్ కట్ చేసిన తర్వాత నారా లోకేష్‌కు వేడుకల్లో స్వీట్ తినిపించారు.

టీఆర్ఎస్‌కు లోకేష్ చురకలు

టిడిపిని అంతం చేయాలని భావిస్తున్న కొన్నిపార్టీలు ప్లీనరీలు కూడా నిర్వహించుకోలేక వాయిదాలు వేసుకుంటున్నాయని పరోక్షంగా టిఆర్‌ఎస్‌కు చురకలు అంటించారు. ప్రభుత్వం అందించే పధకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ప్రతికార్యకర్త కృషి చేయాలని పిలుపు నిచ్చారు. నాడు మహానాడులో ఎన్‌టిఆర్‌ పార్టీ పెట్టిన ముహుర్త బ్రహ్మండంగా ఉన్నందునే నానాటికి తెలుగుదేశంపార్టీ కార్యకర్తల బలం ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు. అధినేత ఆలోచన మేరకు డిజిటల్‌ సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని, 25లక్షల లక్ష్యంగా పెట్టుకుని సభ్యత్యాలు చేయించాలని భావించినప్పటికి 50లక్షలకు చేరుకోవడం అద్భుతమన్నారు.

కార్యకర్తలను ఆదుకోవాలనే సంకల్పంతోనే సభ్యత్యం చేయించుకున్న ప్రతి కార్యకర్తలకు ప్రమాద బీమా, ఇతర సేవా కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే 30వేలమంది కార్యకర్తలతో మాట్లాడటం, ఆదుకోవడం జరిగిందన్నారు.

2012లో పదిలక్షల మంది కార్యకర్తలు చేర్పించడం పసుపు సైన్యం దేశంలోనే ప్రధమంగా రికార్డుల్లోకి ఎక్కిందని, తాజాగా యాభై లక్షలకు చేరుకోవడంతోపాటు అమెరికా సైన్యానికి మించిన బలం తెలుగుదేశానికి ఉండటం గర్వకారణమని టిడిపి ఎన్నికల కమిటీ నేత కళా వెంకట్రావు అన్నారు. కేవలం 49రోజుల్లోనే 50లక్షల సభ్యత్య నమోదు చేయడం అరుదైన రికార్డుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు టిడి జనార్ధన్‌రావు, వివివి చౌదరి, జయరాంరెడ్డి, ఎవిరమణ, బొద్దులూరి వెంకటేశ్వరరావు, బివి రమణ, కృష్టమూర్తి, పెద్దిరెడ్డి రామరావు,రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

English summary
Telugudesam party leader and Andhra Pradesh CM Nara Chandrababu Naidu's son Nara Lokesh said that TDP membership has crossed 50 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X