విద్యార్థుల ఆత్మహత్యలపై వైఎస్ జగన్‌కు అనిత సూటి ప్రశ్న! మీడియాపై ఇలా...
రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై బుధవారం ఏపీ అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే అనిత వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్‌రెడ్డికి సూటి ప్రశ్న సంధించారు. మీడియాకు కూడా కొన్ని సూచనలు చేశారు.
అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై బుధవారం ఏపీ అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే అనిత వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్‌రెడ్డికి సూటి ప్రశ్న సంధించారు.
విద్యార్థుల ఆత్మహత్యలను ఎంతసేపూ రాజకీయ కోణంలో చూస్తున్నారే తప్ప ఏనాడు అసలేంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకోకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చిన్నపాటి సూచన కూడా జగన్ చేయలేదన్నారు.

విద్యార్థులు, యువకులతో యువభేరి అని చాలా మీటింగ్‌లు పెట్టిన జగన్ ఎప్పుడు చూసినా ప్రభుత్వాన్ని నిందించడం, సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించడమే తప్ప ఏ రోజైనా విద్యార్థులకు సంబంధించి సూచనలు చేశారా? అని అనిత ప్రశ్నించారు.
విద్యార్థులు ఏ రీతిలో నడుచుకోవాలి, మానసిక క్షోభకు గురైనప్పుడు వారు ఆ స్థితి నుంచి ఏవిధంగా బయటికి రావాలి, ఏ విధంగా తమ భవిష్యత్‌కు విద్యార్థులు బంగారు బాట వేసుకోవాలి.. ఇలాంటి విషయాలపై ఒక్క సూచనైనా చేశారా? అని నిలదీశారు.
తమ ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీ నాయకులు చివరికి విద్యార్థుల ఆత్మహత్యలను కూడా రాజకీయంగా వాడుకోవడం దురదుష్టకరమని అనిత అన్నారు. అంతేకాదు, మీడియాకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు ఎమ్మెల్యే అనిత.
విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రైవేట్ కాలేజీల గురించి మాట్లాడుతూ...''విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఆ ప్రభావం మరికొంతమంది విద్యార్థులపై పడే అవకాశముంది.. నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు దయచేసి క్షమించండి..'' అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
బుల్లితెరపై వస్తోన్న సీరియల్స్ గురించి కూడా అనిత మాట్లాడారు. కొన్ని సీరియల్స్‌లో ఆత్మహత్య ఏవిధంగా చేసుకోవాలి, హత్య ఏవిధంగా చేయాలనేవి కూడా క్లియర్‌గా చూపిస్తున్నారని, అలాంటి వాటిపై నిషేధం విధించాలంటూ స్పీకర్ ద్వారా ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
వియన్నా లాంటి దేశాల్లో విద్యార్థుల ఆత్మహత్యలను మీడియాలో అతిగా చూపించకూడదని ఒక చట్టం తీసుకొచ్చారని, అలాంటి చట్టం మనం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications