కలకలం: ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్ కుమారుడి ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు .
తిరుపతి: కాలూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో సాయిచరణ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న సాయిచరణ్ స్కూల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్లాస్ లో టీచర్ మందలించడం వల్ల మనస్థాపం చెందినందునే సాయిచరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు.

స్కూల్ యాజమాన్యం నుంచి విద్యార్థి మృతికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications