సెల్ఫీ అడిగిన అభిమాని.. ఈడ్చి కొట్టిన బాలకృష్ణ(వీడియో)
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బాలకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ముక్కుసూటి తత్వం, ఆయన టెంపర్. బాలకృష్ణ చాలా సౌమ్యుడుగా కనిపిస్తారు. ఆయనలోని ముక్కుసూటి తత్వం,చిన్నపిల్లాడి మనస్థత్వం చాలామందికి నచ్చుతోంది. పైకి అలాగ కనిపిస్తారు కానీ బాలయ్య ఎంతో సరదాగా ఉంటారని సినీ, రాజకీయ సెలబ్రిటీలు చెప్పడం చాలాసార్లు విన్నాం. ఇక తేడా వస్తే ఆయన తన చేతికి పని చెబుతుంటారు. బాలకృష్ణ చాలాసార్లు తమ అభిమానులపై చేయి చేసుకున్నారు. కొట్టడం బాలయ్యకు... కొట్టించుకోవడం ఆయన ఫ్యాన్స్‌కు అలవాటుగా మారిపోయింది.
తాజాగా మరోసారి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన కదిరిలో చోటు చేసుకుంది. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కదిరిలో బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి నెట్టుకోవడంతో.. బాలయ్య ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆగ్రహంతో అభిమానిపై చేయి చేసుకున్నారాయన. దీంతో అక్కడున్న వారంతా కూడా షాక్ అయ్యారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే బాలకృష్ణ హిందుపూరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బాలకృష్ణ 2014,2019 వరుస ఎన్నికల్లో హిందుపూరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే బాలకృష్ణ ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సెల్ఫీ అడిగిన అభినానిని ఈడ్చి కొట్టిన బాలకృష్ణ. pic.twitter.com/k19xkZqxBm
— Actual India (@ActualIndia) April 13, 2024
ఈసారి ఎన్నికల్లో బాలకృష్ణకు చెక్ పెట్టాలని అధికార వైసీపీ భావిస్తోంది. బాలకృష్ణపై TN దీపికను అభ్యర్థిగా ప్రకటించారు. హిందుపూరం నియోజకవర్గ బాధ్యతలను దీపికకు అప్పగించింది. హిందూపురం నుంచి మహిళా అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఓ మహిళ నాయకురాలిని తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపలేదు. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications