అతను తప్పు చేయడం వల్లే రాష్టానికి ఈ దుష్టితి వచ్చింది..! సంచలన నిజాలు వెలుగులోకి

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో బాంబు పేల్చారు. జమిలి ఎన్నికలపై ఆయన ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు కేంద్రం ప్రతిపాదిస్తున్న విధంగా జమిలి ఎన్నికలకు తన పార్టీ టీడీపీ సై అంటుంటే ఆయన మాత్రం కేంద్ర, రాష్ట్రాల సమ్మతి లేకుండా జమిలి కష్టమంటున్నారు. ఏపీ వరకూ గోరంట్ల చెప్పినదాంట్లో వాస్తవం ఉన్నా ఇతర రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్రం ఆ రిస్క్ తీసుకునే పరిస్ధితి లేదు.

ఇప్పటికే కేంద్రం జమిలి ఎన్నికలపై రెండు బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ రెండు బిల్లులపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అదే రోజు వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా జమిలి బిల్లులపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఆమోదం కావాలనే అర్దం వచ్చేలా బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

TDP MLA Gorantla Buchaiah Chowdary Criticizes Jagan Government on Power Tariffs and Comments on Jamili Elections

మరోవైపు ఏపీలో కరెంటు ఛార్జీల పెంపుపై విపక్ష నేత వైఎస్ జగన్, ఆయన పార్టీ వైసీపీ చేస్తున్న ఆందోళనల్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పుబట్టారు. ప్రజలు అధికారమిస్తే జగన్‌ దాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని గోరంట్ల ఆరోపించారు.
అధిక ధరకు బొగ్గు కొని ప్రజలపై భారం మోపారన్నారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఛార్జీలు పెరిగాయని బుచ్చయ్య విమర్శించారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. విద్యుత్ రంగం గాడిలో పడేందుకు సమయం పడుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+