మనసున్న నేత వైఎస్ జగన్... అవునన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర పోస్ట్!!
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ మాత్రం అవకాశం వచ్చినా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో టార్గెట్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో, జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేయడంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్టైలే వేరు. నిత్యం వైసీపీ ప్రభుత్వ తీరుపై, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై, రాష్ట్రంలో ప్రజల సమస్యలపై విరుచుకు పడే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా లో తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
మన'సున్నా'నేత వైఎస్ జగన్ : గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యంగ్యం
ఆసక్తికరమైన పోస్టులతో ఆలోచించేలా చేసే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఫెయిల్యూర్ సీఎం గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోమారు సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనసున్న నేత సీఎం జగన్ అని వైసీపీ నాయకులు చెబుతున్నారు అని.. అవును ప్రజలు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తున్నారని పేర్కొంటూ, కాకుంటే మన'సున్నా'నేత అని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి కి 'సున్నం' పూసిన మనసున్న నాయకుడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు అంటూ సెటైర్లు వేశారు.
జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి సున్నా .. గోరంట్ల ఆగ్రహం
సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి సున్నాగా మారిందని, అందుకే మన సున్నా నేత అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితి పై కూడా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి, తనదైన శైలిలో ట్వీట్ చేశారు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పటికే అనేకమార్లు రోడ్ల సమస్యలపై విరుచుకుపడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా మరోమారు సోషల్ మీడియాలో మండిపడ్డారు.

రోడ్ల దుస్థితి పైనా జగన్ పై గోరంట్ల విసుర్లు
ఆంధ్ర ప్రదేశ్ రోడ్ లు స్విమ్మింగ్ పూల్స్ గా మారాయని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మహాప్రభో..అది రోడ్డా..లేక నీటి కుంటనా అంటూ ప్రశ్నించారు. మీరు 'బటన్లు' నొక్కడం ఏమో కాని జనాల టైర్ల 'బటన్లు' పోతున్నాయి వైయస్ జగన్ అంటూ సెటైర్లు వేశారు. జనాల ఒళ్ళు హూణం అయిపోతుంది అంటూ తనదైన శైలిలో జగన్ ను టార్గెట్ చేశారు . ఇక రాజమండ్రి లో రోడ్ల పరిస్థితి ఇలా ఉందని రోడ్లపై టైర్లు దెబ్బతినడంతో ఆగిపోయిన వాహనాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications