"లేపేస్తే డబ్బే డబ్బు".. కోటంరెడ్డి హత్యకు మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్ !
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ఆయనను చంపితే డబ్బే డబ్బు అంటూ ఐదుగురు రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంలనంగా మారింది.
వీడియోలో ఏం ఉందంటే..
ఈ హత్య మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్‌తోపాటు అతడి ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా విపరీతంగా మద్యం సేవించి.. ఈ ప్లాన్ గురించి రౌడీషీటర్లు జగదీష్, మహేష్, వినీత్‌తో పాటు మరో ఇద్దరు సదరు వీడియోలో చర్చిస్తున్నట్లు కనబడుతోంది. ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు అని మాట్లాడుతున్నారు.

అయితే ఈ హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా.. ONE INDIA తో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య తరహాలోనే తనను కూడా అంతమొందించాలని కుట్రపన్నారని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
వైసీపీలోని కీలక నేత కనుసన్నలలో ఈ హత్యకు ప్లాన్ చేసారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్య కుట్రలో పావుగా ప్రస్తుతం జైల్లో ఉన్న నిడిగుంట అరుణను వాడుకున్నారని కూడా అంటున్నారు. శ్రీధర్ రెడ్డిని చంపడంలో సహకరిస్తే అరుణకు గూడూరు, లేదా సూళ్లూరుపేట అసెంబ్లీ నుంచి టికెట్ కూడా ఇస్తామని ఆశపెట్టారని చెబుతున్నారు. అందుకే శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బులొస్తాయన్న చర్చల్లో ఆమె ప్రియుడు శ్రీకాంత్ ప్రస్తావన వచ్చినట్టు ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు పోలీసుల దృష్టికి రావడంతో విచారణ చేపట్టారు. మరోవైపు శ్రీధర్ రెడ్డికి భద్రత పెంచాలని.. సంబంధిత వ్యక్తులపై విచారణ జరిపాలని కోటంరెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యకు కుట్ర తాడేపల్లిలోనే జరిగిందా..? బెంగుళూరులో స్కెచ్ వేసారా ?? ఎన్ని కోట్లా రూపాయలకు డీల్ జరిగింది అని తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications