బావిలో దూకాల్సింది ఎవరు ? జగన్ కు కోటంరెడ్డి కౌంటర్..!
ఏపీలో యూరియా కొరత సహా పలు అంశాల్లో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు బావిలో దూకాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ సలహా ఇచ్చారు. రాష్ట్రంలో పలు సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్ విమర్శలకు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
బావిలో దూకాలంటూ జగన్ చేసిన సూచనపై స్పందిస్తూ.. బావిలో దూకాల్సింది ఎవరు ? అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఒకరి ప్రాణం ప్రజల కోసం , ఇంకొకరు బ్రతుకు అవినీతి దాహం. ఒకరి రాష్ట్ర ప్రగతిని చెక్కిన దార్శనికుడు, ఇంకొరు ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని అథోగతి పట్టించిన దుర్మార్గుడు. ఒకరు ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు పొందిన తెలుగు విజ్ఞాని. ఇంకొకరు రాష్ట్ర అభివృద్ధిని, మార్గాన్ని, రాష్ట్ర రాజధాని స్వరూపాన్ని, రాష్ట్ర యువత భవిష్యత్తును సమాధి చేసిన అజ్ఞాని అన్నారు.

ఒకరిది పరాయివారిని కూడా సొంత వాళ్లనుకుని ప్రేమించే సంస్కారం. ఇంకొకరిది పదవులు అధికారం కోసం సొంత చిన్నాన్నను చంపుకునే దుర్మార్గం. ఒకరిది తాను బాగుంటే చాలనుకునే స్వార్ధం. ఇంకొకరిది నేను ఎంత కష్టపడ్డా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలనుకునే నిస్వార్ధం అన్నారు.
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) September 10, 2025
తనను గెలిపించిన పులివెందుల ప్రజలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని వ్యక్తిత్వం ఒకరిది. ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ప్రజలకు కూడా తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలతో సమానంగా చూసే మానవత్వం ఇంకొకరిది. ఇప్పుడు చెప్పండి.. తెలుగు తమ్ముళ్లు... బావిలో దూకాల్సింది ఎవరు?, భావి తరాల బంగారు భవిష్యత్ కోసం నిండు నూరేళ్లు వర్థిల్లాల్సింది ఎవరు?.. జయహో చంద్రన్న! అంటూ కోటంరెడ్డి ముగించారు.












Click it and Unblock the Notifications