దొంగ ఓట్లతో గెలిచిన వాడు ప్రజా నాయకుడా ?, వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి నాని సవాల్

ఇంతకాలం అరాచకాల చేసి, దొంగ ఓట్లు వేయించుకుని, సామాన్యులను బెదిరించి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడని, తన మీద నిందలు వేస్తున్నాడని, నేను ఇంత వరకు వాళ్ల నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదని, ఎక్కడ ప్రమాణం చెయ్యమన్నా చెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వైసీపీ నాయకులకు సవాలు విసిరారు.

చంద్రగిరి, తిరుపతిలో ఇంతకాలం చెవిరెడ్డి చేసిన అరాచకాలపై, చంద్రగిరిలో దొంగ ఓట్ల విషయంపై తాను అధికారులకు లేఖ రాయడం జీర్ణించుకోలేక తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

TDP MLA Pulivarthy Nani made sensational comments on YCP leader Chevireddy Bhaskar Reddy

ప్రజా నాయకుడు అంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాడని, అయితే చంద్రగిరిలో ఇంతకాలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలించాడని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లు, ఇంతకాలం వాళ్లు చేసిన అక్రమాలను తాను అడ్డుకుంటున్నానని తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మీద నిందలు వేస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు.

రెండు నెలల క్రితం వరకు వైసీపీ అధికారంలో ఉండేదని, ఆ సమయంలో వైసీపీ నాయకుల దగ్గరకు తాను వెళ్లి అయ్యా నాకు సహాయం చెయ్యండి అని ఎప్పుడూ అడగలేదని, తన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తాను వైసీపీ సహాయం అడగలేదని చెప్పడానికి సిద్దంగా ఉన్నానని, ఎక్కడైనా ప్రమాణం చెయ్యడానికి తాను సిద్దం అని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.

TDP MLA Pulivarthy Nani made sensational comments on YCP leader Chevireddy Bhaskar Reddy

వైసీపీ ప్రభుత్వం హయాంలో తన క్వారీలకు అక్రమంగా జరిమానా విదించారని, ఆ సమయంలో తాను కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తీసుకువచ్చానని, వైసీపీ నాయకుల కాళ్లు పట్టుకోలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని పులివర్తి నాని అన్నారు. తుడా చైర్మన్ గా పని చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుమారు రూ. 240 కోట్ల రూపాయల నిధులు అక్రమ మార్గంలో ఆరు మండలాలకు బదలాయించారని, ఈ విషయంపై విచారణ జరిపించాలని తాను ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పుడు తన మీద బురదచల్లడానికి ప్రయత్నిస్తున్నారని పులివర్తి నాని ఆరోపించారు.

తిరుపతి పద్మావతి యూనివర్శిటీలో జరిగిన దాడిలో తనకు గాయాలు కాలేదని చెవిరెడ్డి ఆరోపిస్తున్నారని అయితే ా రోజు తనకు తగిలిన గాయాలు ఇంకా మానలేదని ఆ నోప్పులతో ఇంకా బాదపడుతున్నానని పులివర్తి నాని అన్నారు. ఇంతకాలం అధికారం అడ్డం పెట్టుకుని ఇంతకాలం దోచుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు తాను వదిలిపెట్టనని, విచారణ జరిపించి ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+