ఏపీకి 'హోదా': పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి వినూత్నంగా భావించి చేపట్టిన నిరసన చూసి విశాఖప ప్రజలు విస్తుత పోయారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ టీడీపీ ఎంపీలు సోమ, మంగళవారాల్లో పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ కుమార్ వినూత్న నిరసనకు దిగారు. ఖద్దరు వదిలి... కాషాయం వస్త్రాలు ధరించిన ఆయన ఏకంగా పీఠాధిపతి అవతారం ఎత్తారు. అనంతరం పీఠాధిపతి అవతారంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నివాసానికి గణేశ్ కుమార్ ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.

మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే విచిత్ర వేషధారణలో తన ఇంటికి రావడంతో విష్ణుకుమార్ రాజు షాక్ తిన్నారు. అనంతరం ఇంటిలోకి ఆహ్వానించడంతో ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీ పీఠాధిపతులకు ఇస్తున్న గౌరవం ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

అందుకోసమే పీఠాధిపతి వేషంలో తాను బీజేపీ ఎమ్మెల్యేను కలవడం జరిగిందని చెప్పుకొచ్చాడు. ప్రత్యేకహోదా కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తామని, అన్ని ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం మాటలతో, అంకెలతో గారడీ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

 ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

రాజ్యసభలో అరుణై జైట్లీ అనుసరించిన వైఖరి అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ బాటలోనే బీజేపీ వెళితే ప్రజలు హర్షించరని అన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని కలిశానన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

మరోవైపు వినతిపత్రం తీసుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌కు చేసిన సహాయం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి చేయలేదని అన్నారు.

 ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీకి, కేంద్ర మంత్రివర్గానికి ప్రత్యేకమైన అభిమానం ఉందని అన్నారు. తన భార్య మనస్సులోనే ప్రత్యేకహోదా ఎప్పుడు వస్తుందనే అతృత ఉందని, తనకూ ఒక ఆంధ్రుడిగా ప్రత్యేకహోదా కావాలని ఉందన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీకి ప్రత్యేకహోదా: పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే

ప్రజల మనోభావాలను గౌరవించి ప్రత్యేకహోదా అంశం ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp mla Vasupalli ganesh Kumar protest in a form of swamiji.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X