అన్నం పెట్టిన చేతికే సున్నమా, ఐవైఆర్న్ తొలగించడం సరైందే: బుద్దా వెంకన్న

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ పదవి నుండి ఐవైఆర్ కృష్ణారావును తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంచి నిర్ణయం తీసుకొన్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఅన్నారు.

మంగళవారంనాడాయన మీడియాతో మాట్లాడారు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి అంటూ ఐవైఆర్ కృష్ణారావుపై దుమ్మెత్తిపోశారు బుద్దా. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం నీచమైన చర్యగా పేర్కొన్నారు.

Tdp MLC Buddha Venkanna supports Chandrababu decission on Ap Brahmana corporation

అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఐవైఆర్ కృష్ణారావు వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి నుండి తొలగించారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp MLC Budda Venkanna appreciated Ap chiefminister Chandrababu naidu decission on removed IYR Krishna Rao from Ap Brahmna parishad chairman.he spoke to media on Tuesday at Amaravati.
Please Wait while comments are loading...