అవి మేం నిరూపిస్తాం, సిద్దమా?, బురదలో దొర్లే పందివి: రోజాపై బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు
విజయవాడ: చంద్రబాబు సర్కారును చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీ నేతలు ఆమెపై కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోజా మద్యం తాగి ప్రెస్ మీట్స్ పెడుతోందని వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. పట్టపగలే మద్యం తాగొచ్చి రోజా ప్రెస్ మీట్స్ పెడుతోందని, ఇష్టారీతిన మాట్లాడుతోందని ఆరోపించారు. కావాలంటే.. ఈసారి రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెను టెస్ట్ చేయాలని, ఆ టెస్టుల్లో ఆమె మద్యం సేవించింది లేనిదీ తేలుతుందని అన్నారు.

రోజా బురదలో దొర్లే పంది:
రోజా మాటలు వినడానికి మహిళలే ఇబ్బందిపడుతున్నారని అన్నారు. అంతేకాదు, రోజాను బురదలో దొర్లే పంది మాదిరిగా జగన్ రోడ్డు మీదకు వదిలాడని ఆయన విమర్శించారు. రోజా ఆ బురదను అందరి మీదకు చిమ్ముతోందని విమర్శించారు. వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ లాగా రాష్ట్రంలో తిరుగుతోందని మండిపడ్డారు. క్రిష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి, విశాఖలో విజయసాయిరెడ్డి, గుంటూరులో రోజారెడ్డి.. దండుపాళ్యం గ్యాంగ్ లాగా తయారయ్యారని అన్నారు.

నీలిచిత్రాలు.. మద్యం.. మేం నిరూపిస్తాం
నీలిచిత్రాల్లో నటించి సినీ పరిశ్రమ పరువు తీసిన నువ్వా మాకు నీతులు చెప్పేదని వెంకన్న విమర్శించారు. రోజా నీతులు మాట్లాడుతుంటే బూతుల్లా వినిపిస్తున్నాయన్నారు. నీ నీలి చిత్రాల క్యాసెట్లు.. నువ్వు మద్యం తాగడం మేము నిరూపిస్తాం. దీనిపై నువ్వు బహిరంగ చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఆడకూతురివి అని వదిలేస్తే నీ వాగుడు పరాకాష్టకు చేరిపోయిందన్నారు. మహిళలు విజయవాడలో నిన్ను కోడిగుడ్లు, చీపురు కట్టలతో కొట్టడానికి సిద్దంగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు.
Recommended Video


నిన్ను చెప్పుతో కొట్టలేదా
ఆరోజు అయేషా మీరా హత్య విషయంలో రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేశావు కదా... దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ముడుపులు తీసుకుని దాని గురించి మాట్లాడట్లేదా? అని వ్యాఖ్యానించారు. నువ్వో ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. నీకు నచ్చిన చానెల్ లో కూర్చుందాం.. నీలిచిత్రాలు, మద్యం తాగడంపై
సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం.. దీనికి నువ్వు రెడీనా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కాపురాన్ని కూలిస్తే నిన్ను చెప్పుతో కొట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు.. అల్లూరి సీతారామరాజు
చంద్రబాబు గారు శాంతమూర్తిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ లాంటి వారు. ఆయనకు గానీ నిజంగా కోపం వచ్చి మీ (వైసీపీ) చేష్టలు పరాకాష్టకు వెళితే.. చంద్రబాబునాయుడి గారిలో మరో అల్లూరి సీతారామరాజుని చూస్తారు. చంద్రబాబునాయుడు గారేమీ సామాన్య వ్యక్తి కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మీ (వైసీపీ) మీద ప్రయోగించడం లేదు అని బుద్దా వెంకన్న రోజాను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications