శనికి చీరకట్టి, జాకెట్టు తొడిగితే రోజా: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి: బీష్ముడిపై శిఖండిని వదిలినట్లుగా వైసీపీ అధినేత వైయస్ జగన్.. పార్టీకి చెందిన చిత్తూరు నగరి ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నేత రోజాతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాట్లాడిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. కరువుకు ప్యాంట్ షర్ట్ వేస్తే అన్న రోజా వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రోజాది ఐరన్ లెగ్ అని అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజాతో అబద్ధపు, అసత్యపు మాటలతో దాడి చేస్తున్నారని విమర్శించారు. అసలు రోజా తన గురించి ఏమనుకుంటుందని ప్రశ్నించారు.

TDP MLC Buddha Venkanna Sensational Comments On MLA Roja And YS Jagan

రోజా ఏం మాట్లాడిన గట్టిగా మాట్లాడకుండా ఉండటానికి గల కారణం ఆమె అడపిల్లేనని అన్నారు. రోజా ఏంటీ, రోజా పరిస్థితి ఏంటని నిలదీశారు. ఆమె తమ పార్టీలోకి రావడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యామని, తమ పార్టీ నుంచి ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లగానే వైఎస్ ప్రాణాలు కోల్పోయారని, జగన్ జైలుకెళ్లాడని తెలిపారు.

బీష్ముడిపై శిఖండిని వదిలినట్టు చంద్రబాబుపై విమర్శలకు రోజాను జగన్ ప్రయోగిస్తున్నాడని ఆయన ఆరోపించారు. కుటిల రాజకీయాల కోసం జగన్ మహిళలను వాడుకుంటున్నాడని ఆయన విమర్శించారు. ఇలా జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+