మద్యం తాగి అలా, నీతులు చెప్పే హక్కు లేదు: రోజాపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు

విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆదివారం నాడు తీవ్ర విమర్శలు చేశారు. పట్టపగలే మద్యం తాగి రోజా మీడియా సమావేశాల్లో టిడిపి నేతలపై, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. రోజా నీతులు చెబుతోంటే బూతులు మాట్లాడినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రోజాపై బుద్దా వెంకన్న వ్యక్గిగత విమర్శలకు కూడ దిగారు. రోజాను తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు.

దాచేపల్లి ఘటనపై టిడిపి , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. రాజకీయంగా దాచేపల్లి ఘటనను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నం చేశారని ఒకరిపై మరో పార్టీ విమర్శలు చేసింది.

ఈ ఘటనకు కొనసాగింపుగా టిడిపి నేతలతో పాటు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఆదివారం నాడు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధీటుగా జవాబిచ్చారు. అంతేకాదు వ్యక్తిగత విమర్శలకు కూడ దిగారు.

మద్యం తాగి రోజా మీడియా సమావేశాలు

మద్యం తాగి రోజా మీడియా సమావేశాలు

వైసీపీ ఎమ్మెల్యే రోజా పట్టపగలే మద్యం తాగి మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి అడ్డగోలుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. రోజా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమెను పరీక్షిస్తే మద్యం తాగినట్టు రుజువౌతోందన్నారు. ఇంకా రోజాపై బుద్దా వెంకన్న తీవ్రమైన వ్యక్తిగత విమర్శలకు దిగారు..

రోజాకు నీతులు చెప్పే హక్కు లేదు

రోజాకు నీతులు చెప్పే హక్కు లేదు

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు నీతులు చెప్పే హక్కు లేదన్నారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. రోజా ఇవాళ నీతులు చెబుతోంటే తమకు బూతుల మాదిరిగా విన్పిస్తున్నాయని ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. రోజా చేసే విమర్శలపై విజయవాడలో మహిళలు ఆమెను తరిమికొడతారని ఆయన చెప్పారు.

ఆయేషా మీరా ఘటనపై ఎందుకు నోరు మెదపరు

ఆయేషా మీరా ఘటనపై ఎందుకు నోరు మెదపరు

విజయవాడకు చెందిన ఆయేషా మీరా హత్యలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రోజా అప్పట్లోనే విమర్శలు చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. అయితే ఇవాళ ఆయేషా మీరా హత్య కేసును గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

దాచేపల్లి ఘటనతో రాజకీయం చేసే కుట్ర

దాచేపల్లి ఘటనతో రాజకీయం చేసే కుట్ర

దాచేపల్లి ఘటనను రాజకీయం చేసేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రయత్నించారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అయితే వైసీపీ ఆటలు సాగలేదన్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+