TDP MLC గ్రీష్మ పెళ్లి విషయంలో ట్విస్ట్, దాచాల్సింది ఏమీ లేదు!

తన వాగ్ధాటితో ప్రతిపక్షాన్ని రఫాడించే టీడీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ.. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెకి శాసన మండలిలో స్థానం కల్పించారు. మహా నాడులో తొడగొట్టి వైరల్ అయి టీడీపీ అభిమానుల మనసు గెలుచుకున్న గ్రీష్మ మండలికి వెళ్తున్నారంటే చాలా మంది సంబర పడ్డారు. టీడీపీ అధిష్టానం ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని సైతం ఆమె నిలబెట్టుకుంటూ వస్తున్నారు. మండలిలో వైసీపీ విమర్శలకు గట్టిగానే బదులిస్తున్నారు.

అయితే ఆమె రాజకీయం జీవితం గురించి చాలా మందికి తెలిసినప్పటికి ఆమె వ్యక్తిగతం జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా తన వివాహం గురించి స్వయంగా ఆమె ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్రీష్మ తన పర్సనల్ లైఫ్ గురించి చాలా ధైర్యంగా చెప్పుకొచ్చారు.. తనకు ఇది రెండో వివాహమని, తన భర్త శ్రీనివాస్‌ను ఎలా కలుసుకున్నారో ఆమె ధైర్యంగా వివరించారు.

TDP MLC Kavali Greeshma Reveals Her Love Story A Bold Confession About Her Second Marriage and Life Hurdles

తీవ్ర మానసిక వేదనలో ఉన్న సమయంలో..

గ్రీష్మ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. "నా భర్త పేరు శ్రీనివాస్. ఇది నా రెండో పెళ్లి. నేను ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది జీవితం చాలా గ్లాసీగా ఉంటుందని అనుకుంటారు. 2013లో నాకు మొదటి వివాహం జరిగింది. నా మొదటి భర్త మంచి వ్యక్తి. అయితే, మా మొదటి కుమారుడు చనిపోయిన తర్వాత కుటుంబంలో ఇబ్బందులు చాలా పెరిగాయి. ఆ సమయంలో నేను బాగా మానసికంగా కుంగిపోయాను. జీవితంలో మళ్ళీ రిలేషన్షిప్స్ లోకి వెళ్లకూడదని, బ్రహ్మచారిణిలా ఉండిపోవాలని అనుకున్నాను. సద్గురు వంటి వారు చెప్పినట్లు యోగా, మెడిటేషన్ చేస్తూ ఉందామనుకున్న టైంలో.. శ్రీనివాస్ గారు నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు" అని చెప్పుకొచ్చారు.

తొమ్మిది గంటల చర్చ.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్!

ఆ పరిచయం గురించి వివరిస్తూ.. "మేము ఒకరోజు కలిసినప్పుడు సుమారు 7 నుంచి 8 గంటల పాటు మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాం. కుల వ్యవస్థ, నేషనల్ పాలిటిక్స్, ఎకానమీ వంటి అంశాలపై చర్చించుకున్నాం. ఒక బీసీగా ఆయన అమెరికాలో కంపెనీ పెట్టినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు, ఎస్సీగా నాకు ఉన్న ఛాలెంజెస్.. ఇవన్నీ మొదటి రోజే చర్చించుకున్నాం. 9వ గంటలో మా ఇద్దరికీ ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చాయి. అప్పటికే నేను డేటింగ్ వంటి వాటికి సుముఖంగా లేను. సీరియస్ అయితేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అలా ఆ రోజే పెళ్లి నిర్ణయం తీసుకున్నాం" అని ఆమె తెలిపారు.

తల్లి షాక్.. కుటుంబాల అంగీకారం..

నిర్ణయం తీసుకున్న వెంటనే గ్రీష్మ తన తల్లికి వీడియో కాల్ చేసి విషయం చెప్పారు. "అమ్మ మొదట షాక్ అయ్యారు. శ్రీనివాస్ క్వాలిటీస్ నాకు నచ్చాయని, మీరు కూడా కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పాను. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో, శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు కూడా మొదట కొంత ఆలోచించారు. ప్రతిభా భారతి గారి కూతురు అంటే పొలిటికల్ బ్యాగ్రౌండ్ వల్ల చిన్న భయం ఉంటుంది. కానీ, రెండు మూడు నెలల తర్వాత అందరం కలిసి మాట్లాడుకున్నాం. అలా మా వివాహం జరిగింది" అని గ్రీష్మ తన వివాహ బంధం వెనుక ఉన్న ఆసక్తికర కథను వెల్లడించారు.

మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా, పున్నయ్య గారి మనవరాలిగా రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గ్రీష్మ.. తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+