జగన్‌కి సినీతారలతో లింక్స్: లోకేశ్‌పై సాక్షి కథనానికి రాజేంద్ర ప్రసాద్ కౌంటర్

హైదరాబాద్: వైపీసీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌‌కి సినీతారలతో సంబంధాలున్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సినీతారలతో ఆయనకు సంబంధాలు ఉండబట్టే వారాలు, నెలల పాటు మాయమవుతుంటారని ఆయన దయ్యబట్టారు.

అలా మాయమయ్యే సమయంలో జగన్ సినీతారలతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ యువనేత, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ ఎప్పుడో పదేళ్ల కిందట చదువుకునే రోజుల్లో మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్లిన ఫోటోలను వైసీపీ నేతలు ప్రదర్శించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

tdp mlc rajendra prasad fires ysr congress chief ys jagan over nara lokesh images

ఇప్పటికైనా వైసీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుండా ఓవరాక్షన్ చేస్తే, వైయస్ జగన్‌కు సంబంధించిన ఆధారాలు బయటపెడతామని తెలిపారు. రాజాంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై బనాయించిన కేసులో దమ్ము, ధైర్యం ఉంటే నిజాలు బైటపెట్టాలని వైసీపీ అధినేత సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రతిస్పందనకు టీడీపీ నేతలు కొన్ని వీడియో దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు.

అయితే ఆ వీడియోలలో మిథున్‌రెడ్డి విమానాశ్రయ మేనేజర్‌పై దాడి చేసినట్లు గానీ, చేయిచేసుకున్నట్లుగానీ ఎలాంటి ఆధారాలూ లేవు. విమానాశ్రయంలో ప్రయాణీకులు, సిబ్బంది ఒక్కచోట గుమిగూడినట్లు మాత్రమే ఆ ఫుటేజిలో కనిపిస్తోంది.

అయితే, దీనికి ప్రతిస్పందనగా సాక్షి వెబ్‌సైట్‌లో నారా లోకేశ్ ఒక చేతిలో మగువ మరో చేతిలో మందు గ్లాసు ఫోటో, మరో ఫోటోలో విదేశీ వనితలతో స్విమ్మింగ్ పూల్‌లో ఆటలాడుతున్న ఫోటోలతో ఒక కథనంగా ప్రచురించింది. ఈ వార్తా కథనానికి కౌంటర్‌గా టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+