వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓపిక నశించింది: సీఎం రమేష్ సంచలనం, రాజీనామాకు సుజనా రెడీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పాత పాటే పాడారని టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు.ఏపీ ప్రజలు ఓపిక పట్టే రోజులు పోయాయని సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు.

పార్లమెంట్లో ఏపీకి సంబందించిన కేటాయింపులపై గురువారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మరోసారి ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై టిడిపి ఎంపీలు పెదవి విరిచారు.

మిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనంమిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనం

కేంద్ర ప్రభుత్వం మాటలు చెబుతోందని అరుణ్ జైట్లీ తీరుపై టిడిపి ఎంపీలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్ళు దాటుతున్నా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని టిడిపి ఆరోపణలు చేసింది.

ఏపీ ప్రజల ఓపిక నశించింది

ఏపీ ప్రజల ఓపిక నశించింది

నాలుగేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం మాటలు చెబుతోందని టిడిపి ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలకు ఓపిక నశించిందన్నారు. తమ పార్టీ కూడ బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు.

రాజ్యసభ నుండి టిడిపి ఏంపీల సస్పెన్షన్, 'బిజెపితో ఎలా కలిసి ఉండాలి'?రాజ్యసభ నుండి టిడిపి ఏంపీల సస్పెన్షన్, 'బిజెపితో ఎలా కలిసి ఉండాలి'?

 ఏపీ హక్కుల కోసమే బిజెపితో కలిశాం

ఏపీ హక్కుల కోసమే బిజెపితో కలిశాం

ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపితో తాము కలిసినట్టుగా టిడిపి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.కానీ,ఏపీకి బిజెపి నుండి ఆశించిన ప్రయోజనం దక్కలేదన్నారు. ఏపీ ప్రభుత్వానికి బిజెపి నుండి ఆశించిన మేరకు నిధులు రాలేదన్నారు. ప్రజలంతా తమ పార్టీపై ఎన్నో

ఆశలు పెట్టుకొన్నారని సీఎం రమేష్ గుర్తు చేశారు. ఏపీకి నిధులు ఇవ్వాల్సిందేనని సీఎం రమేష్ డిమాండ్ చేశారు.

జనసేన ఎఫెక్ట్: ఫిబ్రవరి 11న, పవన్‌తో భేటీ, పొలిటికల్ రిస్క్: ఉండవల్లిజనసేన ఎఫెక్ట్: ఫిబ్రవరి 11న, పవన్‌తో భేటీ, పొలిటికల్ రిస్క్: ఉండవల్లి

 ఏపీకి అన్యాయం చేస్తే పుట్టగతులుండవు

ఏపీకి అన్యాయం చేస్తే పుట్టగతులుండవు

ఏపీకి అన్యాయం చేస్తే పుట్టగతులుండవని బిజెపిపై టిడిపి ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రం కారణమని టిడిపి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. ఏపీకి అన్యాయం చేస్తే పుట్టగతులుండవని చెప్పారు.

 రాజీనామాకు సుజనా చౌదరి సిద్దం

రాజీనామాకు సుజనా చౌదరి సిద్దం

కేంద్ర మంత్రి పదవికి మంత్రి సుజానా చౌదరి సిద్దంగా ఉన్నారని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. రాజ్యసభలో మంత్రి సుజనాచౌదరి ప్రసంగాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడ్డుతగలడాన్ని మంత్రి నారాయణ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ ఇచ్చిన విషయాన్ని మంత్రి నారాయణ గుర్తు చేశారు.

English summary
Tdp Mp Cm Ramesh sensational comments on Arunjaitley speech on Thursday at Newdelhi.No new points in Union finance minister Arun jaitley speech he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X