ప్రత్యేక హోదా ఎవరికీ లేదన్నారు..ఇదేంటి : నిలదీసిన టీడీపీ ఎంపీ..!!
ఎవరికీ ప్రత్యేక హోదా లేదని చెప్పిన కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయాలను ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ లో ప్రశ్నించారు.
ఏపీకి ఇచ్చిన హామీల అమలు పైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి పదేళ్ల గడువు పూర్తి కాబోతోందని గుర్తు చేసారు. ఇప్పటికైనా వాటి అమలు దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాటి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాలని కోరారు. తాజా బడ్జెట్ లో చేసిన కేటాయింపులు ఏపీకి నిరాశగా మారాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రత్యేక హోదా ఎవరికీ లేదని చెబుతూ..తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించారు. 13వ షెడ్యూల్ లో చెప్పినవన్నీ అమలు చేయాలని గల్లా డిమాండ్ చేసారు.
కేంద్ర బడ్జెట్ పై చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ అంశాల పైన స్పందించారు. కర్ణాటకలోని జాతీయ ప్రాజెక్టు అయిన అప్పర్ భద్రకు రూ 5,300 కోట్లు కేటాయించి ఏపీ జాతీయ ప్రాజెక్టు పోలవరం కు ఏమీ ఇవ్వకపోవటం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు రూ 55, 657 కోట్లకు ఆమోద ముద్ర వేయాలని..నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం తిరిగి ఇవ్వాలని కోరారు. 14వ ఆర్దిక సంఘం సిఫార్సుల కారణంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని..ఇక పై ఏ రాష్ట్రానికి ప్రత్యేక పన్ను రాయితీలు ఉండవని కేంద్రం గతంలో చెప్పిందని గల్లా గుర్తు చేసారు. 2022-23 బడ్జెట్ లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు రూ 3,631 కోట్లు ఐజీఎస్టీని పారిశ్రామిక ప్రోత్సాహకంగా తిరిగి చెల్లిచందని వివరించారు.

ఇందుకోసం బడ్జెట్ లో నిధులు కేటాయించిందని చెప్పారు. దీన్ని బట్టి ప్రత్యేక హోదా అమలవుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీకి మేలు జరిగేదన్నారు. గల్లా జయదేవ్ తన ప్రసంగంలో రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ గురించి ప్రస్తావించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న హామీని పలు మార్లు నెరవేరుస్తామని చెప్పినా ఇంకా అమలు కాలేదని నిలదీసారు. రైల్వే జోన్ కు రూ 10 కోట్లు కేటాయించినా, అది ఎప్పటి నుంచి పని ప్రారంభిస్తుందో చెప్పలేదన్నారు. బెంగుళూరు మెట్రోకు రూ 14,700 కోట్లు, ఇతర మెట్రోలకు రూ 19 వేల కోట్లు కేటాయించిన మంత్రి ఏపీలోని విశాఖ, విజయవాడ మెట్రో గురించి ప్రస్తావన చేయలేదని చెప్పుకొచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులకు బడ్జెట్ లో చోటు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications