జగన్ రెడ్డి .. ఆ ఘనత మీదే .. మేం వాటిని సన్మానాలుగా భావిస్తాం : కేశినేని నానీ
ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానీ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని , ఆయన పాలనను ఉద్దేశించి ఫైర్ అయ్యారు . ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసిన కేశినేని నానీ తనపై, తమ పార్టీ ఎంపీలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయారు . రాజధాని అమరావతి రైతుల తరపున పోరాటం చేస్తున్న తమపై కక్షగట్టారని ఆయన ఆరోపించారు. జగన్ రెడ్డి ... ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని టీడీపీ ఎంపీ కేశినేని నానీ తేల్చి చెప్పారు.

ఎంపీలపై మీరు పెట్టే కేసులను సన్మానాలుగా భావిస్తామన్న ఎంపీ కేశినేని నానీ
అమరావతి పరిరక్షణ కోసం రాష్ట్రం కోసం రైతులు కోసం పోరాడుతున్న ముగ్గురు పార్లమెంటు సభ్యుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎంపీ గళ్ళ జయదేవ్, కనకమేడల రవీంద్ర, కేశినేని నానీలపై నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో అంటూ తమను జగన్ ఏమీ చెయ్యలేడని ఆయన పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఎపీలను అరెస్ట్ చేసి , కేసులు పెట్టి చిత్రహింసలను గురి చేసిన తీరుపై కేశినేని నానీ మండిపడ్డారు .

న్యాయం కోసం నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని మండలి చైర్మన్ కు కితాబు
ఇక అంతే కాదు మండలిలో టీడీపీ విజయం సాధించటంతో మండలి చైర్మన్ షరీఫ్ ను ఆయన కొనియాడారు. నీతి, నిజాయితీకి మారుపేరు ముస్లింలు.విశ్వసనీయతకు నిలువుటద్దం ముస్లిం సమాజం అని కేశినేని నానీ పేర్కొన్నారు . విలువలకు కట్టుబడి నిబద్ధతతో ఈ రోజు న్యాయం కోసం నిలబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ గారికి హృదయ పూర్వక అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు .

నీ ఫ్యాక్షనిష్టు మెంటాలిటికి మూల్యం చెల్లించుకుంటావ్ అని ఫైర్
ఇక నిన్నటికి నిన్న జగనన్నా ..ఇదేమి ప్రజాస్వామ్యం అంటూ కౌన్సిల్ లో సీసీటీవీలు, టీవీలు బంద్ చేసి కౌన్సిల్ సభ్యులు కాని 22 మంది నీ మంత్రులతో కౌన్సిల్ లో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నావ్. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇంత హంగామా జరగలేదు. నీ ఫ్యాక్షనిష్టు మెంటాలిటికి మూల్యం చెల్లించుకుంటావ్ అని నిప్పులు చెరిగిన కేశినేని నానీ ఎంత నిరంకుశంగా వ్యవహరించినా టీడీపీ ఎంపీలు, నాయకులు భయపడేది లేదని రాజధాని అమరావతి విషయంలో వెనక్కు తగ్గేదిలేదని తేల్చి చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications