విడదల రజనీకి ఎంపీ లావు దిమ్మదిరిగే కౌంటర్..! నువ్వు మొదలుపెట్టింది నేను..!
ఏపీలో పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీపై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె కూటమి ప్రభుత్వాన్ని, అందులోనూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని టార్గెట్ చేస్తూ నిన్న చేసిన ఫోన్ ట్యాపింగ్ విమర్శలు సంచలనంగా మారాయి. దీంతో విడదల రజనీకి లావు ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. మీరే మొదలుపెట్టారు.. ఇప్పుడు మేము ముందుకి తీసుకెళ్తామంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.
విడదల రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు ఇతర అధికారుల వాంగ్మూలాలు ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే తానేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని, తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని, మా వాళ్ళకు ఒక న్యాయం, బయటి వారికి ఒక న్యాయం ఉండదని లావు గుర్తుచేశారు.

ఫోన్ డేటా, భూములపై విడదల రజనీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ , 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నామని, ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు. అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమికోసం దరఖాస్తు చేసుకున్నాయని, అయినా తాము మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదన్నారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని ఎక్కువ రేటు చెల్లించి మరీ భూమి తీసుకున్నట్లు తెలిపారు. వేలానికి, కేటాయింపుకు మధ్య చాలా తేడా ఉందని రజనీకి గుర్తుచేశారు. ఇదంతా రజినీతో ఎవరు మాట్లాడించారో తనకు బాగా తెలుసన్నారు.
ఒకరిని విమర్శించే ముందు వివరాలు తెలుసుకోవాలని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులపాలవుతారంటూ విడదల రజనీకి లావు కృష్ణదేవరాయుల సూచించారు. విడదల రజిని మాదిరిగా తాను అబద్ధాలు చెప్పలేనన్నారు. ఐపీఎస్ జాషువా సర్వీసు 2040 వరకు ఉందని, జాషువా స్టేట్‌మెంట్‌లో లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్‌కు, తనకు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పాలని లావు తెలిపారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్ మాధవరెడ్డిని రజినీయే తీసుకువెళ్లారని ఐపీఎస్ జాషువాను బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని.. దీంతో జాషువా ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు భారీగా ఫైన్ వేశారని గుర్తుచేశారు. రజనీ రెడ్ బుక్ రాజ్యాంగం విమర్శల్ని లావు కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications