Putta Mahesh Video: పుట్టా మహేష్ వీడియో వీడియో రిలీజ్-ఏం జరిగిందంటే?
ఏపీలోని ఏలూరు లోక్ సభ నియోజకవర్గ ఎంపీ, టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ (putta mahesh yadav) తాజాగా హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకుని పట్టుబడినట్లు ఈగల్ టీం పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఎంపీ కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ పార్టీ, డ్రగ్స్ ఆరోపణలపై పుట్టా మహేష్ స్పందించారు.
తాను ఎక్కడా తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తెలిపారు. ఎన్నో రోజులుగా తెలంగాణలో ఉన్న తన స్నేహితులు పిలుస్తుండటంతో డిన్నర్ పార్టీకి వెళ్లినట్లు వెల్లడించారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఏలూరు ప్రజలకు తానేంటో తెలుసన్నారు. ఏలూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయబోనన్నారు. ఎప్పుడూ తప్పు చేయబోనన్నారు. సోషల్ మీడియా, మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దని పుట్టా మహేష్ తెలిపారు. ఎప్పుడూ తాను నిజాలే మాట్లాడతానని, అబద్దాలు చెప్పనని మహేష్ చెప్పుకొచ్చారు.

మరోవైపు తెలంగాణ డ్రగ్స్ పార్టీలో పాజిటివ్ గా తేలిన పుట్టా మహేష్ యాదవ్ విషయంలో టీడీపీ అధిష్టానం పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించేందుకు టీడీపీ నేతలు నిరాకరిస్తున్నారు. నిన్న ఉదయం ఈ ఘటన బయటపడినా సాయంత్రం వరకూ పార్టీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. చివరికి సాయంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఓ పత్రికా ప్రకటన వెలువడింది. అలాగే డ్రగ్స్ ఘటనపై వివరణ ఇవ్వాలని పుట్టా మహేష్ కు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది. అప్పటివరకూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయనకు సూచించారు.












Click it and Unblock the Notifications