'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఏపీలోని ఎంపీల్లో కాస్తంత చలనం తీసుకొచ్చిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో నిన్నటి వరకూ చర్చోపచర్చలు జరిగాయి.

అయితే ఇకపై నిరసనలు హోరెత్తనున్నాయి. ఈ మేరకు ఆదివారం విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన ఆ పార్టీ ఎంపీలు నిరసనలు తెలిపేందుకే సిద్ధమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే వరకు పోరు బాట సాగించాల్సిందేనని కూడా చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోడీకి ఆదివారం టీడీపీ ఎంపీలు లేఖ రాశారు. ప్రధాన మోడీకి రాసిన లేఖను ఎంపీలు పీఎంఓకి పంపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ వాదన వినిపించుకునేందుకు కాస్తంత సమయం ఇవ్వాలని ఆ లేఖలో టీడీపీ ఎంపీలు కోరారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, గడచిన రెండేళ్లలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలుపుకునేందుకు సమయం కేటాయించాలని వారు ప్రధాని మోడీని కోరారు. ఈ లేఖపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహంతో పాటు ఇతర ఎంపీలు కూడా సంతకాలు చేశారు.

 'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

ఇందులో భాగంగా సోమవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు నిరసనకు దిగనున్నారు. కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై రాజ్యసభలో గత వారం స్వలకాలిక చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే.

'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

ఈ చర్చలో భాగంగా బీజేపీ ఏపీకి హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో టీడీపీ ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరుతూ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు లేఖ రాశారు.

'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

కేంద్రం వైఖరితో విసిగిపోయిన ప్రజలు ఆగ్రహానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా జత కలిశాయి. రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదాపై జరిగిన చర్చ సందర్భంగా అరుణ్ జైట్లీ సమాధానంతో అసంతృప్తికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం టీడీపీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

 'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

'హోదా' కోసం ఢిల్లీలో నిరసనలు: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

ఈ సమావేశంలో రాజ్యసభలో చర్చ జరిగిన సమయంలో ఎంపీలు ప్రవర్తించిన తీరుపై ఆయన మండిపడ్డారు. దీంతో పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రధాని మోడీతోనే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరుతూ వారంతా లేఖ రాశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After hinting at reviewing ties with NDA over special status to Andhra Pradesh, TDP today softened its stand and sought for Prime Minister Narendra Modi's appointment to implement the AP Reorganisation Act "in letter and spirit."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి