షిండేకు రాత్రి సమైక్య సెగ: సిఎం చెంపపై కొట్టి, గొంతుపట్టి

మరోవైపు సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాకు గురువారం ఆమోదం తెలపడంతో సమైక్యవాదులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన ఎవరినీ సంతృప్తిపరచలేకపోతోంది.
రాష్ట్రాన్ని విభజించాలన్న ఉద్దేశ్యంతోనే ఇంత కాలం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం జాతీయ హోదాను ప్రకటించలేదన్న ఆగ్రహాన్ని గోదావరి జిల్లాల ప్రజలు వ్యక్తంచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైసిపి నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం రాత్రి 16వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
సుమారు అర్థగంటసేపు జాతీయ రహదారిపై బైఠాయించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్‌కుమార్, వైసిపి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రం నిర్ణయంతో సమైక్యవాదులు మరోసారి సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృతంగా సాగించేందుకు సమాయత్తమవుతున్నారు.
నేడు ఎపిఎన్జీవోలు 24 గంటలు, టిడిపి 48 గంటలు, విద్యార్థి ఐకాస నిరవధిక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకరోజు బందుకు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications