'ప్రత్యేకత'పై మోడీకి టిడిపి ఎంపీల వినతి: తప్పుల తడకగా లేఖ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీలు ప్రధానికి ఓ వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రధానిని కోరారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని వారు ప్రధానికి వివరించారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ చేసిన తప్పులను సరిదిద్దే బాధ్యత తమపైనే ఉందని టిడిపి ఎంపీలు ప్రధానికి చెప్పారు.

కాగా, ప్రత్యేక హోదాపై ప్రధాన మంత్రి మోడీకి ఏపీ టీడీపీ ఎంపీలు ఇచ్చిన లేఖలోని అంశాలు వివాదాస్పదంగా మారిన విషయం మీడియాలో గుప్పుమంది. గతంలో లోక్‌సభలో ఓ ఎంపీ చేసిన ప్రసంగాన్ని యథాతథంగా లేఖలో చేర్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రధానికి వినతి పత్రం ఇస్తూ ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని లేఖలో కోరడం హాస్యాస్పదంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు.

 TDP MPS submit memorandum to PM seeking special status to AP

ఇప్పటికే కేంద్రం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్‌లో ఐదు వేల కోట్లు కేటాయించాలని లేఖలో కోరారు. వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ ఎంపీలు ప్రధానిని కలిశారు. కానీ ఈ లేఖ చూసిన తర్వాత టీడీపీ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని అంటున్నారు.

శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత వైఎస్‌ చౌదరి నేతృత్వంలో టీడీపీ ఎంపీల బృందం మోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై నాలుగు పేజీల వినితిపత్రాన్ని అందజేశారు. అయితే ఈ నివేదికలోని అంశాలు వివాదాస్పందగా మారినట్లు శుక్రవారంనాడు మీడియా వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+