జగన్‌కు కౌంటర్: మార్చి 5నే టిడిపి ఎంపీల రాజీనామా, బిజెపితో కటీఫ్: ఆది
అమరావతి: వైసీపీ సవాల్‌కు టిడిపి స్పందించింది మార్చి 5వ, తేదిన కేంద్రం నుండి సానుకూల స్పందన రాకపోతే తమ పార్టీకి చెందిన ఎంపీలు అదే రోజున రాజీనామాలు చేయనున్నట్టు ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 6వ, తేదిన వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామని ప్రకటించారు.
ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు హట్ హట్‌గా మారాయి. అధికార టిడిపి, విపక్ష వైసీపీలు ఒకరిపై మరోకరు కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహన్ని అనుసరిస్తున్నారు.
తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలగకుండా ఉండేందుకుగాను ఈ రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

మార్చి 5 రాజీనామాలు
మార్చి5న, తమ పార్టీకి ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. మార్చి 5న, తొలిరోజునే కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ నిధుల విషయంలో ప్రకటన రావాల్సిందేనని ఆదినారాయణరెడ్డి చెప్పారు.ఒకవేళ కేంద్రం నుండి ప్రకటన రాకపోతే తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తామని ప్రకటించారు.బిజెపితో తెగదెంపులు చేసుకొంటామని ఆదినారాయణరెడ్డి ప్రకటించారు.

జగన్ సవాల్ కు టిడిపి స్పందన
టిడిపికి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు. గురువారం నాడు నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలను చేయించాలని జగన్ టిడిపికి సవాల్ విసిరారు.ఈ సవాల్‌కు టిడిపి స్పందించింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. జగన్ సవాల్‌కు ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఏప్రిల్ 6వ, తేది వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే టిడిపి ఎంపీలు మార్చి 5నే రాజీనామాలు చేస్తారని ప్రకటించారు.

కేంద్రంతో తెగదెంపులు
కొంత కాలంగా ఏపీ పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో టిడిపి నేతలు తీవ్రంగా విసిగిపోయి ఉన్నారు. అయితే కేంద్రం నుండి ఆశించిన మేరకు నిదులు రావడం లేదని అసంతృప్తితో ఉన్నారు. తాజాగా బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపులో ఎలాంటి ప్రత్యేకమైన కేటాయింపులు లేకపోవడంతో టిడిపి నేతలు బహిరంగంగానే నిరసనలు చేపట్టారు. మార్చి5వ, తేదిన డెడ్‌లైన్ పెట్టుకొన్నారు. అదే రోజున కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ విషయమై స్పష్టత ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేయడంతో పాటు కేంద్రంతో తెగదెంపులు చేసుకొంటామని ప్రకటించారు.

సవాల్ కు ప్రతిసవాల్
తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని వైసీపీ ప్రకటించింది. అయితే ఏఫ్రిల్ 6వ, తేదిన ఎంపీల రాజీనామాలతో ప్రయోజనం ఉండదని టిడిపి వైసీపీ వ్యూహంపై ఎదురుదాడి చేసింది మార్చి 5వ, తేది నుండి బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున తమ డిమాండ్ల సాధనకు డెడ్‌లైన్ పెట్టుకొంది. ఆ రోజున రాజీనామా చేయడం వల్ల రాజకీయంగా వైసీపీపై పై చేయి సాధించే అవకాశం ఉందని టిడిపి అభిప్రాయపడింది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications