జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకం కాదు:ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు
విజయవాడ:జమిలి ఎన్నికలకు టిడిపి వ్యతిరేకం కాదని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు పునరుద్ఘాటించారు. తాము ముందస్తు ఎన్నికలకు మాత్రమే అభ్యంతరం తెలిపినట్లు ఆయన స్పష్టం చేశారు.
విజయవాడలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సమర్థత వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రం తొలిస్థానం సాధించిందని కళా వెంకట్రావు చెప్పారు. 29 రాష్ట్రాలను దాటుకొని ముందువరుసలో నిలబడ్డామని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు పూర్తవడంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇరిగేషన్‌కు నాలుగేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. చంద్రన్న బీమా గురించిన వివరాలు ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను కోరారు. కడప, విశాఖలో ఎంపీల దీక్షలు విజయవంతమయ్యాయని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపైన చర్చించాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications