లగడపాటి అంచనా టీడీపీ నమ్మటం లేదా: నేతలు ఏమయ్యారు : అసలు కారణం అదేనా..!
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చేది చెప్పకనే చెప్పేసారు. కోడ్ ఉండంతో..చివరి దశ పోలింగ్ ఉన్నా..ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసారు. తెలంగాణలో కారు ఎక్కుతున్నారు..ఏపీలో సైకిల్ ఎక్కారు అంటూ పరోక్షంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని తన అంచనా అంటూ విశ్లేషించారు. అయితే, సర్వే ఫలితాలు ఈ రోజున వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అయితే, లగడపాటి ఫలితాల పైన వైసీపీ ఆరోపణలు చేయగా..టీడీపీ మాత్రం స్పందించలేదు. దీనికి అసలు కారణం ఏంటంటే..
టీడీపీ నేతల మౌనం వెనుక...
లగడపాటి టీడీపీకే అనుకూలంగా వ్యవహరిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఊహించిన విధంగానే ఆయన పరోక్షంగా చెప్పినా..ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తన అంచనాలను స్పష్టం చేసారు. సహజంగానే వైసీపీ నేతలు ఈ విశ్లేషణ మీద ఆరోపణలు చేసారు. విశ్లేషణకు ముందు విజయవాడలో టీడీపీ నేతలను కలిసి నేరుగా మీడియా సమావేశానికి వచ్చి టీడీపీ గెలుస్తుందని చెప్పటం ద్వారానే అసలు విషయం తెలుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తమకు అనుకూలంగా అంచనాలు చెప్పినా టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా ఈ విశ్లేషణ పైన స్పందించలేదు.

అయితే, టీడీపీ నేతలు సైతం ఈ అంచనాలను నమ్మటం లేదా అనే చర్చ వినిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికల ఫలితాల అంచనాలో విఫలమైన లగడపాటి ఇప్పుడు ఏపీలో చేసిన విశ్లేషణ పైన స్పందిస్తే 23 తరువాత ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఇదే సమయంలో.. లగడపాటి సర్వే వివరాలు..జాతీయ - ప్రాంతీయ మీడియా- సర్వే సంస్థలు ఈ సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలను వెల్లడి చేయనున్నాయి.
లగడపాటి మినహా..మిగిలిన అందరూ..
ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు రానున్నాయి. జాతీయ సర్వే సంస్థల నుండి ఇప్పటికే టీడీపీ..వైసీపీ ఏపీలో ఫలితాల ట్రెండ్స్ పైన అంచనాలు తెలుసుకొనే ప్రయత్నం చేసారు. దీని ద్వారా టీడీపీ ముందుగానే వైసీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు వస్తాయనే నిర్ణయానికి వచ్చేసారు. లగడపాటి సర్వేతో పాటుగా తెలుగు మీడియా సంస్థలు రెండు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇవ్వనున్నట్లు పార్టీ నేతల వద్ద ఉన్న సమాచారం. దీంతో..లగడపాటి అంచనాల పైన అతిగా స్పందించ కూడదని టీడీపీ నేతలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక, ఆదివారం సాయంత్రం నుండి వరుసగా వచ్చే ఎగ్గిట్ పోల్స్ ఎలా ఉన్నా 23వ తేదీ ఎగ్జాక్ట్ ఫలితాలు మాత్రం తమకే అనుకూలంగా ఉంటాయని వాదించటానికి టీడీపీ నేతలు సింగిల్ పాయింట్ అజెండాతో సిద్దం అవుతున్నారు. వైసీపీ మాత్రం ఈ మూడు రోజులు సేఫ్ పొజీషన్‌లో ఉంటుంది. 23న ఫలితాలు అనుకూలంగా వస్తే ఓకే.. లేకుంటే వైసీపీ సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్తుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications