కేంద్రంతో టిడిపి కటీఫ్, ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్ర మంత్రి వర్గం నుండి వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపికి చెందిన ఇద్దరు ఎంపీలు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రం నుండి బయటకు రావాలని నిర్ణయం తీసుకొన్నట్టు చంద్రబాబునాయడు ప్రకటించారు. 

  No special status to AP : 2 Ministers may Quit Modi Cabinet

  బుధవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో కేంద్రం తీరుపై టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీ రాష్ట్రంతో అనుసరిస్తున్న తీరుపై పార్టీ ప్రజా ప్రతినిధులతో చంద్రబాబునాయుడు చర్చించారు.

  ఎన్డీఏ నుండి బయటకు రావాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని బాబు నిర్ణయానికి వచ్చారు.

  ఎన్డీఏకు బాబు గుడ్‌బై

  ఎన్డీఏకు బాబు గుడ్‌బై

  ఎన్డీఏకు గుడ్‌బై చెప్పాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు బాబుకు సూచించారు. ఈ సూచన మేరకు ఎన్డీఏలో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని బాబు భావించారు. ఈ మేరకు పార్టీ నిర్ణయంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబునాయుడు చర్చించారు. అంతేకాదు చంద్రబాబునాయుడు మంత్రులను రాజీనామా చేయించాలని ఆదేశించారు. గురువారం నాడు కేంద్ర మంత్రులు ఆశోక్ గజపతి రాజు , సుజనాచౌదరి రాజీనామాలు చేయనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

  ఆశోక్‌గజపతిరాజుతో ఫోన్‌లో బాబు చర్చలు

  ఆశోక్‌గజపతిరాజుతో ఫోన్‌లో బాబు చర్చలు

  పార్టీ నిర్ణయాన్ని కేంద్ర మంత్రులకు బాబు వివరించారు. అయితే కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు అందుబాటులోకి రాలేదు. కేంద్ర కేబినేట్ సమావేశం ఉన్నందున ఆశోక్ గజపతి రాజు అందుబాటులోకి రాలేకపోయారు. దీంతో ఆశోక్ గజపతి రాజుతో చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఎన్డీఏ నుండి బయటకు రావాలనే అభిప్రాయాన్ని మెజారిటీ నేతలు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజుకు చెప్పారు. దీంతో ఆశోక్ గజపతిరాజు కూడ సానుకూలంగా స్పందించారు.

  ప్రజాభిప్రాయం ప్రకారం నడుద్దాం

  ప్రజాభిప్రాయం ప్రకారం నడుద్దాం


  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు చర్చించారు.ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకొందామని బాబుతో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు చెప్పారు.కేంద్రం కూడ సానుకూలంగా స్పందించే అవకాశాలు కన్పించడం లేదని ఆశోక్ గజపతి రాజు బాబుకు వివరించినట్టు సమాచారం

  టిడిపి కేబినెట్ నుండి బిజెపి కూడ బయటకు వచ్చే అవకాశం

  టిడిపి కేబినెట్ నుండి బిజెపి కూడ బయటకు వచ్చే అవకాశం


  కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి బయటకు వస్తే ఏపీలోని టిడిపి ప్రభుత్వం నుండి బిజెపి మంత్రులు కూడ బయటకు రావాలని నిర్ణయం తీసుకొన్నారు. బిజెపి మంత్రులు కూడ రాజీనామాలు సమర్పించే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకొంటే గురువారం నాడు ఏపీ కేబినేట్ సమావేశానికి బిజెపి మంత్రులు కూడ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  After months of uncertainty, the Telugu Desam Party is on the verge of pulling out of the NDA, with two of the party’s ministers in the Union Cabinet set to submit their resignation letters on Thursday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి