కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కంచుకోటలో టిడిపి జెండా: బాబు ప్లాన్ ఇదే!

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ స్వంత జిల్లా కడపలో 2019 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని టిడిపి చీప్ చంద్రబాబునాయుడు వ్యూహ రచన చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ స్వంత జిల్లా కడపలో 2019 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని టిడిపి చీప్ చంద్రబాబునాయుడు వ్యూహ రచన చేస్తున్నారు.2019 ఎన్నికల కోసం ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థులుగా బరిలోకి దింపాలనే విషయమై పార్టీ అధినేత సర్వే నిర్వహిస్తున్నారని సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజాభీష్టానికి అనుగుణంగా అభ్యర్థులను బరిలోకి దింపాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

కడప నేతలకు బాబు షాక్: లెక్కలు చెప్పి చుక్కలు చూపిన బాబుకడప నేతలకు బాబు షాక్: లెక్కలు చెప్పి చుక్కలు చూపిన బాబు

కడప జిల్లాలో 2014 ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే టిడిపి పరిమితమైంది. అయితే ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.

గతంలో రెండు సార్లు డిఎల్ వెనక్కి: ఈసారైనా...గతంలో రెండు సార్లు డిఎల్ వెనక్కి: ఈసారైనా...

కడప జిల్లాలో వైసీపీని ఢీకొట్టేందుకు టిడిపి ప్రయత్నాలను ప్రారంబించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి టిడిపి నేత బీటెక్ రవీంద్ర చేతిలో ఓటమి పాలయ్యారు.

టిడిపిలోకి డిఎల్ రవీంద్రారెడ్డి, టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్‌ యాదవ్?టిడిపిలోకి డిఎల్ రవీంద్రారెడ్డి, టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్‌ యాదవ్?

ఈ ఫలితాలతో టిడిపి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. కడప జిల్లాలో మరిన్ని స్థానాలను కైవం చేసుకోగలమనే ధీమాతో టిడిపి నాయకత్వం ఉంది. అయితే అందుకు అనుగుణంగా టిడిపి నాయకత్వం చర్యలను ప్రారంభించింది.

జగన్ కంచుకోటలో జెండాకు టిడిపి ప్లాన్

జగన్ కంచుకోటలో జెండాకు టిడిపి ప్లాన్

వైసీపీ చీఫ్ జగన్ స్వంత జిల్లా కడప. ఈ జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ చీఫ్ జగన్‌కు ఆయన స్వంత జిల్లాలోనే ఎదురు దెబ్బతీయాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.ఈ మేరకు ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను టిడిపిలోకి ఆహ్వనిస్తోంది. మైదుకూరు నియోజకవర్గం నుండి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని టిడిపిలో చేర్చుకోనే అవకాశాలు మెండుగా ఉన్నాయని టిడిపి వర్గాలంటున్నాయి.వైసీపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందనే విషయమై టిడిపి నాయకత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ఆధారంగా చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.

జమ్మలమడుగులో టిక్కెట్టు ఎవరికీ?

జమ్మలమడుగులో టిక్కెట్టు ఎవరికీ?

జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి 2019 ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టును ఆశిస్తున్నారు.గత ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పి. రామసుబ్బారెడ్డి పోటీచేశారు. వైసీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేశారు. అయితే రామసుబ్బారెడ్డిపై ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. రాజకీయ పరిణామాల్లో మార్పుల కారణంగా ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరారు.అయితే 2019 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి, పి. రామసుబ్బారెడ్డి టిక్కెట్ల కోసం పోటీపడే అవకాశం కన్పిస్తోంది. అయితే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.ఆదినారాయణరెడ్డికి టిడిపి టిక్కెట్టు ఇస్తే రామసుబ్బారెడ్డి వర్గీయులు సహకరిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మైదుకూరు నుండి డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ?

మైదుకూరు నుండి డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ?

మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరే అవకాశాలున్నాయని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇటీవల కడప జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. అయితే 2019 ఎన్నికల్లో డిఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారంటున్నారు. అయితే పుట్టా సుధాకర్ యాదవ్‌కు టిటిడి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టనున్నరని సమాచారం.

కమలాపురంలో పుత్తా వర్సెస్ వీరశివారెడ్డి

కమలాపురంలో పుత్తా వర్సెస్ వీరశివారెడ్డి

కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి , మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిల మధ్య టిక్కెట్టు కోసం తీవ్ర పోటీ సాగుతోందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ప్రజల్లోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ప్రకటించారు.తాజాగా వీరశివారెడ్డి చేసిన ప్రకటన కమలాపురం టిడిపి రాజకీయాల్లో కలకలాన్ని రేపుతోంది.

పులివెందుల నుండి సతీష్‌రెడ్డి పోటీ?

పులివెందుల నుండి సతీష్‌రెడ్డి పోటీ?

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా సతీష్‌రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇటీవల కాలంలో సాగునీటి విషయంలో సతీష్‌రెడ్డి ప్రతినబూనారు.పులివెందుల నియోజకవర్గంలో సాగునీటిని విడుల చేసిన తర్వాతే సతీష్‌రెడ్డి గడ్డం తీశారు. అయితే ఈ నియోజకవర్గం నుండి సతీష్‌రెడ్డికే టిక్కెట్టు కేటాయించేందుకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదు.

ప్రొద్దుటూరు నుండి సిఎం రమేష్ బరిలోకి

ప్రొద్దుటూరు నుండి సిఎం రమేష్ బరిలోకి

2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుండి సిఎం రమేష్ బరిలోకి దిగుతారనే ప్రచారం కూడ ఉంది. గత ఎన్నికల సమయంలో టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి టిడిపి టిక్కెట్టు దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని వరదరాజులురెడ్డికి టిడిపి టిక్కెట్టు కేటాయించింది. అయితే ఈ ఎన్నికల్లో వరదరాజులురెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో సిఎం రమేష్ పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

టిక్కెట్ల కోసం పోటాపోటీ

టిక్కెట్ల కోసం పోటాపోటీ

కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఎవరికీ టిక్కెట్టు ఇస్తారనే విషయమై చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతిలలో ఎవరికీ టిక్కెట్టు దక్కుతోందనే చర్చ లేకపోలేదు.కడపలో దుర్గాప్రసాద్, హరిప్రసాద్, సుభాన్‌భాషాలు పోటీపడుతున్నారని అంటున్నారు.రాజంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లిఖార్జున్‌రెడ్డికి టిక్కెట్టు దాదాపు ఖాయమనే ప్రచారం కూడ లేకపోలేదు.రైల్వే కోడూరులో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్నారనే ప్రచారం కూడ ఉంది.

English summary
Tdp chief Chandrababu naidu planning to strengthen tdp. Chandrababunaidu survey for candidates to contest in 2019 elections.as per the survey report tdp will give tickets in 2019 election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X