ఏపీ గుళ్లలో విధ్వంసం- కేంద్రం జోక్యం, సీబీఐ దర్యాప్తు- టీడీపీ పొలిట్‌బ్యూరో డిమాండ్
ఏపీలోని దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న విధ్వంసాలపై ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, దేవాలయాల్లో చోటు చేసుకున్న ఘటనలకు కారణాలు, ప్రభుత్వం స్పందన వంటి అంశాలపై పొలిట్‌బ్యూరో చర్చించింది. అనంతరం మాట్లాడిన పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు.
Recommended Video
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులే ప్రధాన అజెండాగా ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగిందని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రైస్తవులు అయినప్పుడు హిందూమతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. దేవాలయాల ఘటనలపై గతంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను సీఎఁ జగన్ ఎందుకు ఖండించలేదని కాల్వ ప్రశ్నించారు. దేవుడికే రక్షణ లేని అనాగరికి రాజ్య స్ధాపనే జగన్ లక్ష్యమని ఆయన విమర్శించారు.

మెజారిటీ ప్రజల మనోభావాలను సీఎం జగన్ దారుణంగా దెబ్బతీస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఏ వర్గం మనోభావాలు దెబ్బతింటే ఆ వర్గం పక్షాన టీడీపీ నిలబడుతుందని కాల్వ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పైశాచికత్వం రాముడి శిరచ్ఛేదనం దాకా వెళ్లిందన్నారు. రాముడి శిరస్సు ఖండించడం వెనుక ఎవరున్నారో తేలాలన్నారు. బ్రిటిష్ కాలంలోనూ ఈ స్ధాయిలో ఆలయాలపై దాడులు జరగలేదన్నారు. హిందూ ధర్మంపై దాడి చేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని కాల్వ ప్రశ్నించారు. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు జరిపితే ఎవరికి చెప్పాలన్నారు.
రామతీర్ధానికి చంద్రబాబు అనుమతి తీసుకుని వెళ్తే అదే రోజు విజయసాయి ఎందుకెళ్లారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. విజయసాయి ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని రామతీర్ధం నుంచి విశాఖ వెళ్లారని కాల్వ గుర్తుచేశారు. విజయసాయిరెడ్డి కారుపై దాడితో చంద్రబాబుకేం సంబంధమన్నారు.
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications