పోడియం వైపుకు టీడీపీ సభ్యులు - స్పీకర్ ఆగ్రహం : సభ వాయిదా..!!
ఏపీ శాసనసభా సమావేశాలు ప్రారంభం కాగానే గందరగోళం ఏర్పడింది. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీని పైన చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు నినాదాలు చేసారు. పోడియం వద్దకు వచ్చారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన టీడీపీ తీరును తప్పు బట్టారు. తాము ప్రతీ అంశం పైనా చర్చకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. టీడీపీ సభ్యుల ఆందోళన పైన స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఛైర్ లోకి వస్తారా అంటూ సీరియస్ అయ్యారు.తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
దీంతో..స్పీకర్ సభను వాయిదా వేసారు. ఈ రోజు సభలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల బిల్లుతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ పెంపు బిల్లు, మద్యం అమ్మకాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాల తీర్మానంపై జరిగే చర్చలో సీఎం జగన్ పాల్గొననున్నారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన ఘటన పైనా మంత్రి ఆళ్ల నాని ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Recommended Video
జంగారెడ్డిగూడెంలో కలకలం రేపిన నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు. కల్తీసారా కారణంగా.. బాధితులు చనిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రాణాలు పోతున్నా స్పందించరా అని మండిపడ్డారు. అయితే, 18కి తుల సంఖ్య చేరటంతో ప్రభుత్వం దీని పైన పూర్తి సమాచారం సభ ముందు ఉంచేందుకు సిద్దమైంది. ఈ ఘటన కు సంబంధించి జిల్లా అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తోంది.












Click it and Unblock the Notifications